5లోపు ఫీజులు చెల్లించాలి
కాళోజి సెంటర్: జిల్లాలో డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, లోయర్, హయ్యర్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్నందున తెలంగాణ డైరెక్టర్ ఎక్షామినేషన్స్ ఆదేశాల మేరకు ఈనెల 5వ తేదీలోపు పరీక్ష ఫీజులు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయకుడు ఒక ప్రకటనలో తెలిపారు. లోయర్ గ్రేడ్ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు 8వ తరగతి లేదా సమానమైన అర్హత గలిగి ఉండాలని, హయ్యర్ గ్రేడ్ పరీక్ష రాసే అభ్యర్థులు లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని అభ్యర్థులకు సూచించారు.
డిప్యూటీ సివిల్ సర్జన్ల నియామకం
గీసుకొండ: వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ప్రమోషన్‌తో బదిలీపై వచ్చిన డిప్యూటీ సివిల్ సర్జన్లు డాక్టర్ ప్రసన్నలక్ష్మి, డాక్టర్ ఇఫ్తికర్ విధుల్లో చేరారు. వారు డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావును సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇద్దరి రాకతో సివిల్ సర్జన్ల కొరత తీరిందని డీఎంహెచ్‌ఓ అన్నారు.
రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో దీపిక ప్రతిభ
రాయపర్తి: రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో మండలంలోని కొత్తూరుకు చెందిన బొమ్మిదేని చంద్రశేఖర్, శ్యామల కుమార్తె దీపిక పాల్గొని ప్రతిభ కనబర్చారు. వనపర్తి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చెస్ పోటీలు అండర్ –19 విభాగంలో టాప్ 10లో ఆమె నిలిచింది. ఈ సందర్భంగా హనుమకొండ ఆర్యభట్ట హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న దీపికను సోమవారం పలువురు అభినందిచారు.
ధాన్యం కొనుగోళ్లు
ముమ్మరం చేయాలి
ఖానాపురం: ధాన్యం కొనుగోళ్లను ముమ్మరం చేయాలని సివిల్ సప్లయ్ డీఎం సంధ్యారాణి సూచించారు. ఖానాపురం, బుదరావుపేట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆమె సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సంధ్యారాణి వెంట డీసీఎస్‌ఓ కిష్టయ్య, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్తమ ఫలితాల
సాధనకు కృషి చేయాలి
ఖానాపురం: విద్యార్థుల ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని జీఈసీఓ ఫ్లోరెన్స్ అన్నారు. మండలంలోని అశోక్‌నగర్ కేజీబీవీ గురుకుల పాఠశాలను సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు పాటు పడాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఓ మేనక, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నాన్‌బోర్డర్లు
ఖాళీ చేయాల్సిందే!
కేయూ క్యాంపస్: కేయూలోని వివిధ హాస్టళ్లలో ఉంటున్న నాన్‌బోర్డర్లు వారం రోజుల్లో వేకెట్ చేయాలని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం సోమవారం ఒక సర్క్యూలర్ జారీ చేశారు. వర్సిటీ క్యాంపస్‌లోని హాస్టళ్ల ప్రాంగణాల్లో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు, పరిశోధకులకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో శాంతి, క్రమశిక్షణ, భద్రతను కాపాడుతూ.. విద్యావాతారణాన్ని సమర్థవంతంగా కొనసాగించేందుకు పలు మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు రిజిస్ట్రార్ వెల్లడించారు.
5లోపు ఫీజులు చెల్లించాలి
5లోపు ఫీజులు చెల్లించాలి
5లోపు ఫీజులు చెల్లించాలి


