ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలి

Dec 2 2025 7:14 AM | Updated on Dec 2 2025 7:54 AM

కలెక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా సాగేలా నోడల్‌ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలో నియమించిన నోడల్‌ అధికారుల విధులపై వరంగల్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొదటి విడత నామినేషన్లు పూర్తై స్క్రూటీని జరుగుతోందని, అదేవిధంగా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ సాగుతోందని చెప్పారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నోడల్‌ అధికారులు అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల నిబంధనలు పాటించాలి

నల్లబెల్లి / గీసుకొండ / దుగ్గొండి : ఎన్నికల నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సూచించారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని నామినేషన్‌ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి నామినేషన్లు స్వీకరిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్ల స్వీకరణలో తప్పిదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గీసుకొండ మండలంలోని కొనాయమాకులు, మచ్చాపూర్‌ పంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. దుగ్గొండి మండలంలోని శివాజీనగర్‌, వెంకటాపురం, దుగ్గొండి, మందపల్లి నామినేషన్ల క్లస్టర్లను కలెక్టర్‌ సత్యశారద సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్‌ కోసం ఏఏ పత్రాలు కావాలని హెల్ప్‌డెస్క్‌ సిబ్బందిని కలెక్టర్‌ అడగగా వారు సమాధానం చెప్పే క్రమంలో తడబడ్డారు. దాంతో కనీస వివరాలు తెలియకుంటే ఎలా అంటూ వారిపై అసహనం వ్యక్తం చేశారు. స్క్రూట్నీ, అభ్యంతరాలపై పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. నామినేషన్‌ కేంద్రంలోకి అభ్యర్థితోపాటు ముగ్గురిని మాత్రమే నామినేషన్‌ వేయడానికి అనుమతించాలని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్‌ వెంట జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్లు కృష్ణ, డాక్టర్‌ శుభానివాస్‌, రియాజుద్దీన్‌, రాజేశ్వర్‌రావు, ఎంపీడీఓ అరుంధతి, ఎంపీఓలు శ్రీధర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, సీఐ విశ్వేశ్వర్‌, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలి 1
1/2

ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలి

ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలి 2
2/2

ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement