భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలి
హన్మకొండ: విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. హనుమకొండ న్యూశాయంపేటలోని శ్రీవ్యాస ఆవాసంలో సులక్ష్య సేవా సమితి బాధ్యులు పేద గిరిజన విద్యార్థులకు సోమవారం యూనిఫాం పంపిణీ చేశారు. సీఎండీ పాల్గొని విద్యార్థులకు స్కూల్ యూనిఫాం అందించి మాట్లాడారు. విద్యార్థులు పట్టుదలతో చదువుకుని మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. సులక్ష్య సేవా సమితి అధ్యక్షుడు మండువ సంతోష్, ఫిజిషియన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, శ్రీవ్యాస ఆవాసం అధ్యక్షురాలు వసుంధర, కార్యదర్శి శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్‌న్ డీఈ జి.సాంబరెడ్డి, ఎమ్మార్టీ, విజిలెన్స్ డీఈ అనిల్‌కుమార్, ఏడీఈ ఇంద్రసేనారెడ్డి, ఏఈ అరుణ్ పాల్గొన్నారు.


