
పూర్వ విద్యార్థులు సహకారం అందించాలి
● కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో చదువుకొని వివిధ దేశాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థుల కృషిని అభినందిస్తూ, వర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు సహకారం అందించాలని కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి కోరారు. అమెరికాలోని అట్లాంటాలో ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించగా వీసీ ప్రతాప్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సెలబ్రెట్ అండ్ కంట్రిబ్యూట్ అనే థీమ్‌తో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల సమూహాలు యూనివర్సిటీ గ్లోబల్ భాగస్వామ్యా నికి రావాలని కోరారు. అల్యుమ్ని గోల్డెన్‌జూబ్లీ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమెరికా సంయుక్తరాష్ట్రాల విశ్వవిద్యాలయ ఫార్మసీ చాప్టర్, కేయూ ఫార్మసీ విభాగం పూర్వవిద్యార్థి డాక్టర్ సాంబారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పరుచూరితో పాటుగా పూర్వవిద్యార్థులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.