
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఎల్కతుర్తి: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లోని వివిధ గ్రామాల్లో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొత్తకొండ నుంచి నారాయణగిరి వరకు రూ.400 కోట్ల వ్యయంతో రోడ్డు వెడల్పు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముల్కనూరులోని ఆరు జిమ్ సెంటర్లను ప్రారంభించారు. అక్కడి నుంచి మోడల్ స్కూల్‌కు వెళ్లి విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ముల్కనూరు నుంచి కొత్తపల్లి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్కతుర్తి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
క్యాన్సర్‌ను కొనితెచ్చుకోవద్దు
ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు డబ్బులిచ్చి క్యాన్సర్‌ను కొని తెచ్చుకుంటున్నారని.. నిత్యం వినియోగించే వస్తువుల్లో ప్లాస్టిక్‌ను దూరం పెట్టాలన్నారు. నియోజకవర్గంలో 340 హోటళ్లు ఉంటే ఒక్కో హోటల్‌కు 100 చొప్పున 34 వేల స్టీల్ గ్లాస్‌లు అందించినట్లు తెలిపారు. భీమదేవరపల్లి మండలంలో 49 హోటళ్లకు 4,900ల స్టీల్ గ్లాస్‌లు అందించామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మండలానికి ఒక్క డబుల్ బెడ్‌రూం కూడా రాలేదన్నారు. తమ ప్రభుత్వంలో మొదటి విడతగా నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను వివరించారు. అనంతరం ఎస్‌ఆర్‌ఆర్ ఫార్మసీ కళాశాల ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఫంక్షన్ హాళ్లలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన–ప్రగతి బాట కార్యక్రమంలో లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ విద్యాలత, డీఆర్డీఓ మేన శ్రీను, ఆర్డీఓ రమేశ్‌రాఽథోడ్, హౌసింగ్ డీఈ సిద్ధార్థ నాయక్, తహసీల్దార్లు రాజేశ్, ప్రసాద్‌రావు, ఎంపీడీఓలు వీరేశం, విజయ్‌కుమార్, ఇతర శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన