
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకరు
● పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకరని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాలలోని పద్మశాలి ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం పరకాల, నడికూడ బీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. బోగస్ హామీలతో అధి కారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మళ్లీ రెవంత్‌రెడ్డి మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని, ప్రజాపాలన పేరుతో ప్రజల సొ మ్మును దోచుకుంటున్నారన్నారు. ఈఎన్నికల్లో బీ ఆర్‌ఎస్ సత్తా చాటడం ఖాయమన్నారు. అందుకో సం ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పరకాల, నడికూడ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
23న కేయూకు
రాష్ట్ర విద్యా కమిషన్ రాక
కేయూ క్యాంపస్: రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఈనెల 23న కాకతీయ యూనివర్సిటీకి రానున్నట్లు రిజిస్ట్రార్ వి.రామచంద్రం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు యూనివర్సిటీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థి, ఉద్యోగసంఘాలు, పరీక్షల నియంత్రణాధికారి, విభాగాల అధిపతులు, డీన్‌లు, ప్రిన్సిపాళ్లు, అనుబంధ కళాశాలల ప్రిన్సి పాల్స్, స్టేక్ హోల్డర్లకు కేటాయించిన సమయానికి అనుగుణంగా కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.