
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి
నర్సంపేట రూరల్: జిల్లాలోనే గంగదేవిపల్లి, మరి యపురం మాత్రమే ఆదర్శ గ్రామాలుగా ఉన్నాయి.. వాటి మాదిరిగానే భోజ్యనాయక్‌తండాను ఆదర్శంగా తీరిదిద్దేందుకు కృషిచేస్తానని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. నర్సంపేట మండలంలోని భోజ్యనాయక్‌తండాలో మూతపడిన పాఠశాలను కలెక్టర్ విద్యార్థులతో కలిసి గురువారం పునఃప్రారంభించి మాట్లాడారు. గంగదేవిపల్లి మారిదిగానే భోజ్యానాయక్‌తండాను అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలపాలని సూచించారు. అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఉజ్వ ల భవిష్యత్ ఉంటుందని వివరించారు. విద్యార్థులు ఇష్టంగా చదివి భావిభారత పౌరులు కావాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. గణితశాస్త్రం, ఆంగ్లంపై పలు ప్రశలు వేసి సమాధానాలు రాబట్టారు. పాఠశాల ఆవరణలో కలెక్టర్, అధికారులు, విద్యార్థులతో కలిసి మొ క్కలు నాటారు. కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, డీఈఓ జ్ఞానేశ్వర్, నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ రఘుపతిరెడ్డి, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ కొర్ర సారయ్య, ఎంపీఓ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణంలో ప్రగతి కనిపించాలి
న్యూశాయంపేట: జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్పష్టమైన ప్రగతి కనిపించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పనుల పురోగతిని పరిశీలించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో ఇళ్ల నిర్మాణం, రేషన్‌కార్డుల వెరిఫికేషన్, భూభారతి దరఖాస్తుల పరిష్కారం, వనమహోత్సవంలో నాటే మొక్కల ప్రగతి, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 8,750 ఇళ్లు మంజూరు కాగా.. 4,806 గ్రౌండింగ్ అయి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వారంలోగా నిర్మాణ పనులు గ్రౌండింగ్ చేసేలా సంబంధిత అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో జిల్లాను ముందువరుసలో ఉంచాలన్నారు. ఇళ్లను ఎంత త్వరగా పూర్తిచేస్తే అంతే త్వరగా బిల్లులు అందిస్తామని లబ్ధిదారులకు తెలియజేయాలని సూచించారు. రేషన్‌కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా 58,841 దరఖాస్తుల్లో 41,836 దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తిఅయ్యిందని తెలిపారు. మిగిలిన వాటిని ఈనెల 13వరకు వెరిఫికేషన్ పూర్తిచేయించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా జిల్లాల్లో 31 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేయాలన్నారు. దోమలు నిల్వకుండా ఆయిల్‌బాల్స్ ఉపయోగించాలని, గ్రామాల్లో ప్రతి ఫ్రైడే డ్రైడేగా పాటించాలన్నారు. సమీక్షలో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, గృహనిర్మాణ పీడీ గణపతి, డీపీఓ కల్పన, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పీఎం విశ్వకర్మయోజనపై సమీక్ష..
ప్రధాన మంత్రి విశ్వకర్మయోజన, తెలంగాణ ఐపాస్, జిల్లా ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ మీటింగ్‌లో కలెక్టర్ సత్యశారద పాల్గొని మాట్లాడా రు. ప్రధానంగా వృత్తిదారులకు మద్దతుగా పీ ఎం విశ్వకర్మ యోజన అమలు,లబ్ధిదారులకు శిక్షణ, ఆ ర్థిక సాయం,టూల్ కిట్ల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు.వృత్తిపరమైన నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తూ లబ్ధిదారులు ఆర్థికంగా స్థిరపడేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
భోజ్యనాయక్ తండాలో
పాఠశాల పునఃప్రారంభం

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి