
పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌కు ఎమ్మెల్యే నాగరాజు హాజరు
వర్ధన్నపేట: హైదరాబాద్‌లోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో కృష్ణా నది జలాలపై రాష్ట్ర భారీ నీటిపారుల శాఖ మంతి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం పవర్‌పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరయ్యారు. కార్యక్రమంలో పలు కార్పొరేషన్ల చైర్మన్లు, నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నీట్‌లో సిద్ధార్థ ప్రతిభ
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారానికి చెందిన నాసం సిద్ధార్థ నీట్‌లో ప్రతిభ కనబరిచాడు. ఇటీవల ప్రకటించిన నీట్ ఫలితాల్లో ఓబీసీ విభాగంలో 37,917 ర్యాంకు సాధించగా.. గురువారం ప్రకటించిన రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో ఓపెన్ కేటగిరీలో 1,111వ ర్యాంకు పొందడం విశేషం. నాసం సూర్యనారాయణ–రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు నాసం అవినాశ్ కరీంనగర్‌లోని చెల్మెడ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చిన్న కుమారుడు సిద్ధార్థ తాజాగా మెరుగైన ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉండడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
గోడ కూల్చిన వ్యక్తిపై కేసు
సంగెం: గోడ కూల్చి చంపుతానని బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. మండలంలోని కాట్రపల్లి శివారు వడ్డెరగూడేనికి చెందిన అల్లెపు లక్ష్మి, కుమార్ దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. సొంతస్థలంలో ఐదు రోజుల నుంచి ఇంటి నిర్మాణ పనులు చేసుకుంటున్నారు. ఇంటి పక్కన ఉండే అల్లెపు జంపయ్య వచ్చి వారి గోడను కూలగొట్టాడు. బూతులు తిట్టి అడ్డు వెళ్లిన కుమార్‌ను చంపుతానని బెదించాడు. బాధితురాలు లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
హజ్ యాత్రకు
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: ముస్లింలు పవిత్రంగా భావించే హజ్‌యాత్ర–26కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు సర్వర్‌మొహియొద్దీన్ ఘాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుకు ఈనెల 31వరకు గడువు ఉందని పేర్కొన్నారు. పాస్‌పోర్ట్ ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముస్లింలు హజ్‌కమిటీ.జీఓవీ.ఇన్ లేదా హజ్ సువిధ మొబైల్ యాప్‌లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఇతర వివరాల కోసం 97044 49236 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
బీఎస్‌ఎన్‌ఎల్ లీగల్ కౌన్సిల్‌గా
నరసింహరాములు
వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా కోర్టు, సబ్ కోర్టులు, జిల్లా వినియోగదారుల ఫోరం పరిధిలోని కేసుల్లో బీఎస్‌ఎన్‌ఎల్ పక్షాన న్యాయవాదిగా పి.నరసింహరాములును కొనసాగిస్తూ అ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. నరసింహరాములు ఈ పదవిలో మార్చి 2026 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేదాకా కొనసాగుతారని పేర్కొన్నారు. ఈసందర్భంగా నరసింహరాములును పలువురు న్యాయవాదులు కలిసి అభినందనలు తెలిపారు.
ఉచిత శిక్షణకు
13న పరీక్ష
విద్యారణ్యపురి: సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్టు ఉచిత శిక్షణకు దరఖాస్తులు చేసుకున్నవారు హాల్‌టకెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అధ్యయన కేంద్రం గౌరవ సంచాలకులు కె.జగన్‌మోహన్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 13న హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్ కాలేజీలో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్‌స్టడీసర్కిల్.కో. ఇన్ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేసి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణ, ఉచిత వసతి భోజనంతో కూడిన శిక్షణ పది నెలలు అందిస్తారని తెలిపారు.

పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌కు ఎమ్మెల్యే నాగరాజు హాజరు