
పుష్కరకాలం తర్వాత తెరుచుకున్న బడి
వేలేరు: పుష్కరకాలం క్రితం మూతపడిన ప్రభుత్వ పాఠశాలను విద్యాశాఖ అధికారులు తిరిగి బుధవారం పునఃప్రారంభించారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం గొల్లకిష్టంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల నమోదుశాతం తక్కువగా ఉందని 12 ఏళ్ల క్రితం మూసివేశారు. కాగా ప్రస్తుతం గ్రామానికి చెందిన 20 మందికి పైగా విద్యార్థులు వివిధ పాఠశాలల్లో చదువుతున్నారు. అయితే వారి తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మాట్లాడి కొంతమంది పిల్లలు పాఠశాలకు వచ్చే విధంగా ఒప్పించారు. పిల్లలు వస్తుండడంతో ఎంఈఓ చంద్రమౌళి బడిని ప్రారంభించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో వేలేరు జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం జ్ఞానేశ్వర్, పంచాయతీ కార్యదర్శి ఉమాకేశ్వర్, ఉపాధ్యాయుడు అరుణ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.