
శాంతిభద్రతలను కాపాడాలి
రాయపర్తి: శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో వర్ధన్నపేట పోలీస్ సబ్‌డివిజన్ పరిధి సీఐలు, ఎస్సైలు, రైటర్లతో బుధవారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్‌ఐఆర్‌ల విషయంలో తొందరపడకూడదని సూచించారు. సమావేశంలో సీఐలు, ఎస్సైలు, రైటర్లు పాల్గొన్నారు.
ట్రాక్టర్‌ను దహనం చేసిన ఆగంతకులు
ఖానాపురం: ఆగంతకులు ట్రాక్టర్‌ను దహనం చేసిన సంఘటన మండలంలోని మనుబోతులగడ్డలో చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తేజావత్‌త్ బాలునాయక్ తన ట్రాక్టర్‌ను ఇంటి ఆవరణలో మంగళవారం రాత్రి ఉంచాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ట్రాక్టర్‌పై డీజిల్ పోసి నిప్పు అంటించారు. దీంతో ట్రాక్టర్ ఇంజన్ భాగం దగ్ధమై రూ.1.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు బాలునాయక్ తెలిపా రు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. మాజీ ఎంపీపీ ప్రకాశ్‌రావు, మాజీ సర్పంచ్ సోమయ్య, సొసైటీ డైరెక్టర్ అశోక్‌యాదవ్, వల్లెపు శ్రీనివాస్ పలువురు బాధితుడిని పరామర్శించారు.
పశువులకు టీకాలు వేయించాలి
నెక్కొండ: వ్యాధులు సోకకుండా పశువులకు ముందస్తుగా టీకాలు వేయించాలని మామునూరు పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి రైతులకు సూచించారు. జాతీయ సేవా పథకంలో భాగంగా గుండ్రపల్లిలో బుధవారం ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పశువులకు గర్భనిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించామని తెలిపారు. పాల దిగుబడి పెంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించామని చెప్పారు. శిబిరంలో 243 పశువులకు వైద్యం అందించామని ఆయన పేర్కొన్నారు. శిబిరం ఏర్పాటుకు జిల్లా పశుసంవర్థక శాఖ శాఖ, స్కై ఈసీ, కారస్, కోరీస్ కంపెనీలు సహకారం అందించాయని వివరించారు. మండల పశువైద్యాధికారి మమత, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు వంశీకష్ణ, రాజశ్రీ, కళాశాల అధ్యాపకులు అనిల్‌కుమార్‌రెడ్డి, ఫణికుమార్, అరుణ, వైద్యవిద్యార్థులు, గోపాలమిత్రులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇంతేజార్‌గంజ్ సీఐకి అత్యుత్తమ పురస్కారం
వరంగల్ చౌరస్తా: విధుల్లో అత్యుత్తమ సేవలందించినందుకు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక సేవా పతకానికి వరంగల్ ఇంతేజార్‌గంజ్ సీఐ షుఖూర్ ఎంపికయ్యారు. ఈమేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఉత్తమ సేవలకు అవార్డును ఎంపిక చేశారు.
బీఎస్‌ఎన్‌ఎల్ లీగల్ కౌన్సిల్‌గా వీరభద్రరావు
వరంగల్ లీగల్ : వరంగల్ జిల్లా కోర్టు పరిధిలో గల కేసుల్లో బీఎస్‌ఎన్‌ఎల్ పక్షాన న్యాయవాదిగా పి.వీరభద్రరావును నియమిస్తూ అ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వీరభద్రరావు ఈ పదవిలో మార్చి –2026 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేదాకా కొనసాగుతారని పేర్కొన్నారు. ఈ మేరకు వీరభద్రరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీరభద్రరావును పలువురు న్యాయవాదులు కలిసి అభినందనలు తెలిపారు.

శాంతిభద్రతలను కాపాడాలి

శాంతిభద్రతలను కాపాడాలి

శాంతిభద్రతలను కాపాడాలి

శాంతిభద్రతలను కాపాడాలి