
విద్యార్థి దశలోనే పొదుపు అలవర్చుకోవాలి
నర్సంపేట: విద్యార్థి దశలోనే పొదుపును అలవర్చుకోవాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో మంగళవారం నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమంలో ఆర్ధిక అక్షరాస్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ పొదుపు చేసుకున్న డబ్బులు జీవితంలో ఎన్నో అవసరాలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తల్లిదండ్రులకు కూడా పిల్లలు పొదుపు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. డబ్బులను పొదుపు చేయకుండా ఖర్చు చేస్తే అవసరమైన సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వివరించారు. ప్రతి ఒక్కరు పొదుపుపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. మొక్కలను నాటడమే కాకుండా ప్రతి ఒక్కరు వాటిని బాధ్యతగా సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ జ్ఞానేశ్వర్, డీఆర్‌డీఓ కౌసల్యదేవి, తహసీల్దార్ మహమ్మద్ అబిద్‌అలీ, జిల్లా బ్యాంకు అధికారి రాజు, గిర్దావర్ మహ్మద్ రషీద్, ప్రిన్సిపాల్ జయశ్రీ, పంచాయతీ కార్యదర్శి సురేష్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధించాలి
పర్వతగిరి: మహిళలు కృత్రిమ ఆభరణాల తయారీలో శిక్షణ పొంది ఆర్ధిక అభివృద్ధి సాధించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. పర్వతగిరి మండల కేంద్రంలోని ఎంపీడీఓ సమావేశ మందిరంలో నాబార్డ్, సెర్ప్ డీఆర్‌డీఏ వరంగల్ సంయుక్త సౌజన్యంతో పర్వతగిరి, వర్ధన్నపేట మండల ఔత్సాహికులకు ఏడు రోజులపాటు నిర్వహించనున్న ఆర్టిఫిషియల్ జ్యూవెలరీ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్ సత్యశారద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కృత్రిమ ఆభరణాలకు చాలా డిమాండ్ ఉందని అన్నారు. గొప్ప వ్యాపారవేత్తలుగా తయారవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ కౌసల్యదేవి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, అడిషనల్ డీఆర్‌డీఓ రేణుకదేవి, సీఎంఓ సీనియర్ జర్నలిస్టు శివ, జిల్లా విద్యాశౠఖ అధికారి, నాబార్డు డీడీఎం, ఎల్‌డీఎం, తహసీల్దార్ వెంకటస్వామి, డీపీఎం దాసు, డీపీఎం సుజాత, ఎంపీఈఓ శేషు, ఏపీఎం టి.కృష్ణమూర్తి, సీసీలు సుధాకర్, రవీందర్‌రాజు, కాంతయ్య, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
‘ఆపరేషన్ ముస్కాన్’ పకడ్బందీగా
నిర్వహించాలి
న్యూశాయంపేట: జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్‌ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమం నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నారుల సంక్షేమమే ధ్యేయంగా ఈనెల 1నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 11వ విడత ఆపరేషన్ ముస్కాన్‌ను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. బాలకార్మికులకు భిక్షాటన, వెట్టిచాకిరిల నుంచి విముక్తి కల్పించి వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలకార్మికులను గుర్తించి బాలసదన్‌లో చేర్పించాలని చెప్పారు. బడికి దూరంగా ఉన్న పిల్లలు, మధ్యలో మానేసిన పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి రాజమణి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ వసుధ పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద