
విద్యార్థులు విలువలు పెంపొందించుకోవాలి
నర్సంపేట: విద్యార్థులు చదువుతోపాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలని జిల్లా వైద్యఆరో గ్యశాఖ అధికారి సాంబశివరావు అన్నారు. నర్సంపేట పట్టణంలోని జిల్లా పరిషత్ మోడల్ హైస్కూల్‌లో మంగళవారం స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులు శారీరక, మానసిక స్థితి, శాసీ్త్రయ దృక్ఫథం ఆర్థిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సైక్రియాటిస్ట్ డాక్టర్ భరత్ మాట్లాడుతూ.. విద్యార్థులు సమస్యలను సాధారణంగా పరిష్కరించుకోవాలని.. మానసిక ఒత్తిడికి గురి కావొద్దని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ నిరంతరం టెలిమానస్ అనే ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు మానసికంగా కౌన్సిలింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. సమస్యలు ఉంటే వెంటనే 14461 నంబర్‌లో సంప్రదించి సలహాలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శాంతకుమారి, ఉపాధ్యాయులు వజ్రం నందగోపాల్, సుజాత, సుధాకర్, కుమారస్వామి, రవి, శ్యాంప్రసాద్, సీసీ నాగరాజ్ పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చేయాలి
ఖానాపురం: జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు, సిబ్బంది సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమి ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, ఆరోగ్య మహిళా కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ మంగళవారం మహిళల కోసం ఆరోగ్య మహిళా కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది ప్రతీ మంగళవారం ఫీవర్ సర్వే చేపట్టాలని, ప్రతీ శుక్రవారం డ్రైడే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు జ్యోతి, కల్పన, సునీత, సిబ్బంది రాజచయ్య, హేమలత, సబిత, శ్రీనివాసచారి, దామోదర్‌రెడ్డి, అనిల్‌కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ సాంబశివరావు