
ఇందిరా మహిళా శక్తి సంబురాలు
వర్ధన్నపేట: ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించి సంవత్సరంం పూర్తయిన సందర్భంగా ఈనెల 7వ తేదీ నుంచి 16 వరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ మహిళా శక్తి సంబురాలను ఘనంగా నిర్వహించాలని డీఆర్డీ ఏ, సెర్ప్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అనిల్ వీఓఏల అధ్యక్ష, కార్యదర్శులకు సూచించారు. పట్టణ కేంద్రంలోని మండల మహిళా సమైక్య కార్యాలయంలో మంగళవారం ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాలను ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో మహిళా సమైక్యలకు ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ పంపులు, మహిళా శక్తి క్యాంటీన్ల మొదలగు వాటి నిర్వహణ బాధ్యతలతో మహిళలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి ప్రత్యేక కార్యక్రమాన్ని మహిళలు వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని తెలిపారు. అనంతరం వివిధ వ్యాపార వాణిజ్య రంగాల్లో రాణిస్తున్న ఉత్త మ ఎంటర్‌ప్రెన్యూర్లను సన్మానించారు. అంతకు ముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహకారంతో మహిళలకు రక్త పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఎం వీర్ల వేణు, సీసీలు గోలి కొమురయ్య, రమేష్, అనిల్ స్వామి, చీకటి కవిత, లెక్కల జ్యోతి, మండల పద్మ, తదితరులు పాల్గొన్నారు.
సెర్ప్ డీఆర్డీఏ
ప్రాజెక్టు మేనేజర్ అనిల్