
సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు
నర్సంపేట రూరల్: సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు అన్నారు. ‘పల్లె దవాఖానాలో సేవలు సున్నా..’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి స్పందించిన డీఎంహెచ్‌ఓ మంగళవారం ఇటుకాలపల్లి పల్లె దవాఖానాను తనిఖీ చేశారు. రికార్డులు, మెడిసిన్, తనిఖీ చేశారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ పల్లె దవాఖానాలో వైద్యులు, వైద్యసిబ్బంది సకాలంలో హాజరుకావాలని, సమయ పాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధులపై వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఫీవర్ సర్వేలతో జ్వరపీడితులు గుర్తించి ప్రత్యేక క్యాంప్‌లను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డెమో అనిల్ కుమార్, డాక్టర్లు అరుణ్‌చంద్ర, డాక్టర్ రామ్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు.

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు