‘పీఎంశ్రీ’తో కొత్తగా.. | - | Sakshi
Sakshi News home page

‘పీఎంశ్రీ’తో కొత్తగా..

Jul 9 2025 6:20 AM | Updated on Jul 9 2025 6:20 AM

‘పీఎం

‘పీఎంశ్రీ’తో కొత్తగా..

పరకాల: పేద విద్యార్థుల చదువుకు నాడు పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ పాఠశాల సమస్యల్లో కొట్టుమిట్టాడింది. మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడ్డారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విద్యార్థులు, ఉపాధ్యాయులు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. కానీ, నేడు పీఎం శ్రీ పథకానికి ఎంపికై నాన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌గా ప్రైవేట్‌ విద్యాసంస్థలకు దీటుగా విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తోంది పరకాల పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల. 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి రూ.27 లక్షల పీఎంశ్రీ నిధులతో పాఠశాలను అభివృద్ధి చేశారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించారు. ఒకప్పుడు ఒక కంప్యూటర్‌ కూడా లేని పాఠశాలతో ఐఎఫ్‌పీ(ఇంటర్నెట్‌ ఫ్లాగ్‌ ప్యానల్‌) ద్వారా ఉపాధ్యాయులు డిజిటల్‌ పాఠాలు బోధిస్తున్నారు. ఈ పాఠశాల పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. ప్రస్తుతం 180 మంది విద్యార్థులు, 14 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలతో విద్యార్థుల్లోని ప్రతిభను ఉపాధ్యాయులు వెలికితీస్తున్నారు. సైన్స్‌, మ్యాథ్స్‌ ప్రాజెక్టుల గురించి వివరిస్తున్నారు. ఆత్మరక్షణకు బాలికలకు కరాటేలో శిక్షణ ఇపిస్తున్నారు. విద్య, ఆరోగ్యం, పోషణకు జీసీఈసీ వంటి క్లబ్‌లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఖర్చుతోనే విద్యార్థులకు విజ్ఞాన, విహార యాత్రలకు తీసుకెళ్తున్నారు. విద్యార్థులకు క్రీడలు, సాంస్కృతిక అంశాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. రెండు మూడు రోజుల్లో విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా పంపిణీ చేయనున్నారు.

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి..

పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఈ పాఠశాలలో చదువుతున్నారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి ప్రవర్తన గమనిస్తున్నారు. చదువులో రాణిస్తున్న విద్యార్థులను ప్రోత్సహిస్తూనే మరో వైపు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

విద్యార్థులకు వసతులు కల్పించాం..

పీఎంశ్రీ పథకానికి పరకాల మండలంలో ఎంపికై న ఏకై క నాన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ కావడం ఎంతో గర్వంగా ఉంది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించారు. విద్యారంగాభివృద్ధికి 2027–28 సంవత్సరం వరకు రూ.ఐదు కోట్ల ఖర్చు చేస్తాం. ప్రస్తుతం ఉన్న 180 మంది విద్యార్థుల సంఖ్య మరో రెండేళ్లలో 500 వరకు పెరుగవచ్చు.

–చక్రవర్తుల మధు, ప్రధానోపాధ్యాయుడు

పాఠశాల అభివృద్ధికి సహకరించాలి

ఐనవోలు: పీఎంశ్రీకి ఎంపికై న ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలని డీఈఓ డి.వాసంతి కోరారు. పాఠశాలలో మంగళవారం జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని సూచించారు. విద్యార్థి పురోగతిపై ప్రతి నెల జరుగనున్న పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌లో ఉపాధ్యాయుడికి తెలియజేయాలని చెప్పారు. మంచి బోధన చేస్తూ విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని ఆమె ఉపాధ్యాయులకు సూచించారు. సమావేశంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్‌ ఆఫీసర్‌ బద్దం సుదర్శన్‌ రెడ్డి, ఎంఈఓ పులి ఆనందం, హెచ్‌ఎం సదానందం, మోహన్‌రావు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రూ.27 లక్షలతో పరకాల

జెడ్పీహెచ్‌ఎస్‌ అభివృద్ధి

పెరిగిన విద్యాప్రమాణాలు,

మౌలిక వసతులు

డిజిట్‌ పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు

త్వరలో విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

‘పీఎంశ్రీ’తో కొత్తగా..1
1/2

‘పీఎంశ్రీ’తో కొత్తగా..

‘పీఎంశ్రీ’తో కొత్తగా..2
2/2

‘పీఎంశ్రీ’తో కొత్తగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement