
చేతులు కోల్పోయి రెండు నెలలుగా ఆస్పత్రిలో..
దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి రామరాజు కొన్నేళ్లుగా విద్యుత్‌శాఖలో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వర్తించాడు. ఈ క్రమంలో గత మే 9న రైతుల వ్యవసాయ బావుల వద్ద ఓ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎగ్జ్‌ఫీజ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు 11 కేవీ తీగ తగిలి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఓ చెయ్యిని పూర్తిగా మరో చేయిని సగం వరకు తీసి వేశారు. రెండు నెలలుగా వరంగల్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే రూ.19 లక్షల వరకు ఖర్చు అయ్యాయి. గ్రామస్తులు దాదాపు రూ.16 లక్షల వరకు విరాళాలు అందించి చికిత్స చేయిస్తున్నారు. ఇంకా చికిత్స కోసం రూ.10 లక్షలు అవసరం అవుతాయని వైద్యులు అంటున్నారని బాధితుడి భార్య రజిత తెలిపింది. పెద్ద కుమార్తె అఖిల ఇంటర్ పూర్తి చేసి ఉన్నత చదువులు ఎలా కొనసాగించాలని మదనపడుతోంది. చిన్న కుమార్తె అక్షిత ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాల్సి ఉంది. ఊరు అండగా నిలిచినా ప్రయోజనం లేకుండా పోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రజిత, పిల్లలు కన్నీటిపర్యంతమవుతున్నారు.
మరికొంతమంది కార్మికుల కన్నీటి గాథలు
– 8లోu

చేతులు కోల్పోయి రెండు నెలలుగా ఆస్పత్రిలో..