
జిల్లా కోర్టులకు పీపీల నియామకం
వరంగల్ లీగల్: జిల్లా మొదటి అదనపు కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది భూక్య వెంకట్రామ్ నాయక్, పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గంప వెంకటరమణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయ, శాసనశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఇరువురు పీపీలుగా బాధ్యతలు స్వీకరించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ, ఇతర న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిశారు. ములుగు జిల్లా మదనపల్లికి చెందిన సీనియర్ న్యాయవాది భూక్యా వెంకట్రాంనాయక్ 1988 నుంచి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, జిల్లా కోర్టు జూనియర్ అసిస్టెంట్‌గా, రాష్ట్ర లోకాయుక్తలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలో కోర్టు ఏర్పడిన నాటి నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావడం ఇదే తొలిసారి. నగరంలోని మట్టెవాడ ప్రాంతానికి చెందిన గంప వెంకటరమణ 18 ఏళ్లుగా న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. వరంగల్ బార్ అసోసియేషన్‌కు మూడు పర్యాయాలు క్రీడా, సాంస్కృతిక కార్యదర్శిగా పనిచేశారు. కాగా, ఇరువురు మూడేళ్ల వరకు బాధ్యతల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పీపీల నియామకంపై పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

జిల్లా కోర్టులకు పీపీల నియామకం