
సైడ్ డ్రెయినేజీ నిర్మించాలని వినతి..
నర్సంపేట మున్సి పాలిటీ పరిధిలోని 20వ డివిజన్‌లో చుక్క కనుకయ్య ఇంటి నుంచి గిరగాని మల్లయ్య ఇంటి వరకు సైడ్ డ్రెయినేజీని నిర్మాణం చేపట్టాలని మాజీ ఎంపీటీసీ రామగోని సౌందర్య కోరారు. ఈమేరకు బుధవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సౌందర్య మాట్లాడుతూ కాల్వ ధ్వంసం కావడంతో ఇళ్లలోకి మురుగు నీరు ప్రవహించి దుర్గంధం వెదజల్లుతూ దోమలు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. స్పందించిన ఎమ్మెల్యే మాధవరెడ్డి సైడ్ డ్రెయినేజీ, సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు సౌందర్య తెలిపారు.