
తాటికాయలను సందర్శించిన ఆర్డీఓ
ధర్మసాగర్: మండలంలోని తాటికాయల గ్రామంలో ఇటీవల ఓ వివాహితపై జరిగిన దాడి విషయంపై ఆర్డీఓ రాథోడ్ రమేశ్ మంగళవారం గ్రామంలో పర్యటించారు. గ్రామంలో జరిగిన అమానవీయ ఘటన పూర్వాపరాలు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు స్థానిక తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
● మరొకరి పరిస్థితి విషమం
ఎల్కతుర్తి: కారు అతివేగంతో వచ్చి ఢీకొట్టడంతో భీమదేవరపల్లి మండలం కొత్తపల్లికు చెందిన ఆళ్ల శ్రీహరి(28) మంగళవారం మృతిచెందాడు. ఈఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్తపల్లికి చెందిన ఆళ్ల శ్రీహరి(28), మంచినీళ్ల వెంకటేశ్ ఇద్దరు కలిసి ద్విచక్రవాహనం (పల్సర్ బైక్)పై సెంట్రింగ్ కర్రకోసం పీసర గ్రామానికి వెళ్లారు. ట్రాలీలో సెంట్రింగ్ కర్ర ఎక్కించి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. కొత్తకొండ సమీపంలోని సబ్‌స్టేషన్ సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన కారు అతివేగంగా శ్రీహరి బైక్‌ను ఢీకొట్టింది. శ్రీహరికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా.. వెంకటేశ్‌కు బలమైన గాయాలవడంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కారు డైవర్ ప్రేమ్‌చంద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయిబాబు తెలిపారు.
ఘనంగా కుమారషష్టి ఉత్సవం
గీసుకొండ: మండలంలోని ఊకల్‌హవేలి నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కుమార షష్టి పూజలు ఘనంగా నిర్వహించారు. శివపార్వతుల కుమారుడు కుమారస్వామి సర్ప రూపంలో కొలువుదీరిన ఈ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేశారు.

తాటికాయలను సందర్శించిన ఆర్డీఓ