
వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి
సంగెం: ప్రాఽఽథమిక ఆరోగ్య కేంద్రం, పల్లె దవాఖానల వైద్యసిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు సేవలందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సాంబశివరావు సూచించారు. తీగరాజుపల్లిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (పల్లె దవాఖాన)ను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులు తనిఖి చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని, మాతాశిశు సంరక్షణ, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలను ప్రోత్సహించాలని, వ్యాధి నిరోధక టీకాలు అందించాలని ఆదేశించారు. సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేయించి తగిన చికిత్సలు అందించాలని, వేసవిలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పల్లె దవాఖాన వైద్యాధికారి లావణ్య, ఏఎన్‌ఎం సునంద, కవితాకుమారి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆరోగ్య జిల్లాగా మార్చాలి
వరంగల్: వేసవికాలంలో ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ మాస్ మీడియా అధికారి అనిల్‌కుమార్ సూచించారు. పైడిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రొటీన్ ఇమ్యునైజేషన్ సెషన్‌ను బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఓఆర్‌ఎస్ కార్నర్ నిర్మించాలని, ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా తగిన చికిత్స అందించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని, ఆశ కార్యకర్త నుంచి అందరూ సమన్వయంతో పనిచేసి తగిన ఫలితాలు రాబట్టి, వరంగల్‌ను ఆరోగ్య జిల్లాగా మార్చడానికి ప్రయత్నం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త యశోద, ఆశ కార్యకర్తలు తిరుపతమ్మ, యశోద, జ్యోతి, అనిత, ప్రభ, పద్మ, సుమలత, గాయత్రి పాల్గొన్నారు.
టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్‌గా
తీగల రాజేశ్‌గౌడ్
సంగెం: టీపీసీసీ లీగల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీ ఐ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర కన్వీనర్‌గా చింతలపల్లి గ్రామానికి చెందిన తీగల రాజేశ్‌గౌడ్ నియమి తులయ్యారు. ఈ మేరకు బుధవారం టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్‌గౌడ్ ఆయనకు నియామకపత్రం అందజేశారు. హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న రాజేశ్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి బాధ్యతలు అప్పగించారు.
రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు
నేటి నుంచి కొత్త పద్ధతిలో
స్లాట్ బుకింగ్
వరంగల్: రిజిస్ట్రేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలతో బుధవారం వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నిబంధన ప్రకారం స్లాట్ల బుకింగ్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిమిషాల్లోనే పూర్తిచేసే విధంగా ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింది జిల్లాలోని వరంగల్, ఖిలావరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈపద్ధతి అమలు చేయనున్నారు. గురువారం నుంచి ఈ రెండు కార్యాలయాల్లో కొత్తగా నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. గతంలో డాక్యుమెంట్లలో ఏమైనా తప్పులు ఉంటే కార్యాలయంలో సరి దిద్దేందుకు ఎడిట్ ఆప్షన్ ఉండేది. కొత్త పద్ధతి ప్రకారం ఈ ఆప్షన్‌ను తొలగించారు. స్లాట్ల బుకింగ్ సమయంలో నమోదు చేసిన వివరాలతోనే రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. ఒకవేళ ఏదైనా తప్పుగా నమోదు చేస్తే సదరు రిజిస్ట్రేషన్‌దారుడు మళ్లీ కొత్తగా స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే లావాదేవీలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని కార్యాలయ వర్గాలు తెలిపాయి.

వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి

వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి