కలగానే కార్యాలయం! | Sakshi
Sakshi News home page

కలగానే కార్యాలయం!

Published Thu, Apr 18 2024 9:30 AM

రోడ్డుపైన వేలం నిర్వహిస్తున్న ఎకై ్సజ్‌ అధికారులు (ఫైల్‌) - Sakshi

పరకాల : అన్ని ఉన్న అల్లుని నోట్లో శని అనే చందంగా ఎకై ్సజ్‌ శాఖ పరిస్థితి తయారైంది. మద్యం దుకాణాలతోపాటు మద్యం అమ్మకాలతో ప్రతి ఏడాది ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అత్యధిక ఆదాయంతో పరకాల ఎకై ్సజ్‌ శాఖ మొదటి స్థానంలో నిలుస్తోంది. కానీ, కార్యాలయం 30 ఏళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతోంది. తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న పరకాల ఎకై ్సజ్‌ కార్యాలయ ఉద్యోగులకు కొత్త భవనానికి నిధులు మంజూరు, పనుల ప్రారంభం సంతోషం కలిగించింది. 2017లో రూ.40 లక్షల నిధులతో కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించాడు. మొదటి దశ (బెడ్‌ లెవల్‌) వరకే పనులు చేపట్టి బిల్లు రావడం లేదని 2019లో కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేశాడు. దీంతో ఎకై ్సజ్‌ కార్యాలయ అధికారులు, ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఇరుకై న భవనంలో విధులు నిర్వర్తించడం, మహిళా అధికారులు ఉన్న భవనంలో మౌలిక సదుపాయాలు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఎకై ్సజ్‌ అధికారులు ఏమైనా కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, బెల్లం, పటికను భద్రపరచడం సవాలుగా మారుతోంది. అదేవిధంగా పట్టుబడిన వాహనాల బహిరంగ వేలాన్ని నడిరోడ్డుపై నిర్వహిస్తుండడంతో వాహనాల రాకపోకలు, అధికారులకు ఇబ్బందికరంగా మారుతోంది.

పరకాల ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో 22 షాపులు..

● పరకాల ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో 22 షాపులకు వచ్చిన 400 దరఖాస్తులతో రూ.8 కోట్ల ఆదాయం.

● ఒక్క షాపు సంవత్సరానికి రూ.55 లక్షలు చెల్లించాలి. అంటే 22 షాపులతో రూ.12.10 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది.

● స్పెషల్‌ ఎకై ్సజ్‌ ఫీజు కింద ఒక్కో షాపు సంవత్సరానికి రూ.5 లక్షలు చెల్లించాలి.

● ఇవేకాకుండా మద్యం అమ్మకాలతో రూ.కోట్ల ఆదాయం వస్తోంది. ఇంత ఆదాయం ఉన్నా పరకాల ఎకై ్సజ్‌ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడం గమనార్హం.

ప్రభుత్వ ఆదాయానికి గండి

సొంతభవనం లేకపోవడంతో 30 ఏళ్లుగా అద్దె చెల్లింపుతో ప్రభుత్వానికి లక్షలాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. నెలకు రూ.6వేలు చెల్లిన్నారంటే ఏడాదికి రూ.72 వేలు.. 30 ఏళ్లపాటు చెల్లించిన అద్దెతోనే సొంత భవనం నిర్మాణం పూర్తయ్యేది.

కార్యాలయం ఖాళీ చేయాలని

ఇంటి యజమాని ఒత్తిడి

అద్దె భవనంలో ఉన్న ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయాన్ని తక్షణమే ఖాళీ చేయాలని ఇంటి యజమాని ఒత్తిడి చేస్తున్నాడు. ఖాళీ చేయాలంటే కార్యాలయానికి తగిన భవనం దొరకడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు సొంత భవనం నిర్మాణం పూర్తికాదు.. ఉన్న భవనం ఖాళీ చేయాలనే ఒత్తిడి తేవడం ఎకై ్సజ్‌ అధికారులకు తలనొప్పిగా మారింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పరకాల పట్టణంలోని ఎకై ్సజ్‌ కార్యాలయానికి సొంతభవనాన్ని నిర్మించాలని అధికారులు, సిబ్బంది కోరుతున్నారు.

అధికారుల దృష్టికి తీసుకెళ్లాం..

సొంత భవనం లేకపోవడంతో పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరు చేయిస్తే మిగతా పనులు పూర్తవుతాయని అధికారులకు వివరించాం. అద్దె భవనం ఖాళీ చేయాలని ఇంటి యజమాని ఒత్తిడి చేస్తున్న మాట నిజమే.

– తాతాజీ, ఎకై ్సజ్‌ శాఖ సీఐ, పరకాల

పరకాలలో ఎకై ్సజ్‌ శాఖకు

కరువైన సొంత భవనం

2017లో నిధులు మంజూరు.. 2019లో పనులు ప్రారంభం

బిల్లులు రాలేదని భవన నిర్మాణాన్ని నిలిపివేసిన కాంట్రాక్టర్‌

రోడ్డుపైనే బహిరంగ వేలం..

అధికారులు, సిబ్బందికి ఇబ్బందులు

పిల్లర్లకే పరిమితమైన 
ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయ భవనం
1/3

పిల్లర్లకే పరిమితమైన ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయ భవనం

అద్దె భవనంలో కొనసాగుతున్న 
పరకాల ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయం
2/3

అద్దె భవనంలో కొనసాగుతున్న పరకాల ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయం

3/3

Advertisement
 
Advertisement
 
Advertisement