పనులు అడ్డుకునే వారిపై చర్య తీసుకోవాలి | Sakshi
Sakshi News home page

పనులు అడ్డుకునే వారిపై చర్య తీసుకోవాలి

Published Wed, Apr 17 2024 1:10 AM

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న రాగంపేట ఉపాధి హామీ కూలీలు  - Sakshi

ఖానాపురం: ఉపాధి పనులు అడ్డుకునే వారిపై చర్య తీసుకోవాలని రాగంపేట కూలీలు మహేశ్‌, బీర య్య, సాంబయ్య, రాధమ్మ, పద్మ కోరారు. ఈ మేరకు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం వారు ధర్నా చేశారు. రెవెన్యూ సిబ్బంది, పో లీసులు వచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామ ని నచ్చజెప్పినా ఆందోళన విరమించలేదు. అనంతరం కూలీలు మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా ఉపాధి పనులు చేయన్వికుండా కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఆక్రమించుకున్న కోరెందులకుంట శిఖం భూముల్లో మట్టి పోస్తేనే పనుల వద్దకు ట్రాక్టర్లు వెళ్లనిస్తామని నిబంధనలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై రఘుపతి కూలీలతో మాట్లాడారు. తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌కు సమస్య వివరించగా చెరువు వద్దకు ఆర్‌ఐ, సిబ్బందిని పంపిస్తామని హామీ ఇచ్చారు. చెరువు వద్దకు ఆర్‌ఐ సత్యనారాయణ వెళ్లి పరిశీలించి త్వరలోనే సర్వేయర్‌తో హద్దులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కూలీలు స్వామి, వెంకన్న, రాజు, భిక్షపతి, కుమారస్వామి, రమేశ్‌, రాజమ్మ, కుమారస్వామి, జయమ్మ, యాదమ్మ, యలేంద్ర, సునీత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement