మోడల్‌ స్కూల్‌ ఎదుట ధర్నా | Sakshi
Sakshi News home page

మోడల్‌ స్కూల్‌ ఎదుట ధర్నా

Published Wed, Apr 17 2024 1:10 AM

పాఠశాల ఎదుట ధర్నా చేస్తున్న తల్లిదండ్రులు - Sakshi

ఖానాపురం: మండలంలోని బుధరావుపేట మోడల్‌ స్కూల్‌ గేట్‌కు తాళం వేసి విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం ధర్నా చేశారు. ఉపాధ్యాయురాలి ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని, విద్యార్థులకు పరీక్షలు నడుస్తున్నాయని ప్రిన్సిపాల్‌ సుధాకర్‌రెడ్డి చెప్పడంతో తాళం తీసి ధర్నా విరమించారు. అనంతరం వినతిపత్రాన్ని ప్రిన్సిపాల్‌కు అందజేశారు. తల్లిదండ్రులు సింగు సుధాకర్‌, మోడెం ఎల్లగౌడ్‌, యోగానందచారి, శ్రీనివాస్‌, చందు, అశోక్‌, సంపత్‌, రమేష్‌, కిరణ్‌, కుమారస్వామి పాల్గొన్నారు.

అధికారుల విచారణ

బుధరావుపేట మోడల్‌ స్కూల్‌లో ఇటీవల ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎంఈఓ రత్నమాల, ఎంఎన్‌ఓ చరణ్‌సింగ్‌ మంగళవారం విచారణ చేపట్టారు. ఎమ్మార్సీ సిబ్బంది శశిధర్‌, సీఆర్పీ భాస్కర్‌ పాల్గొన్నారు.

మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

బుధరావుపేట మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుడు డి.రాజేందర్‌ను సస్పెండ్‌ చేస్తూ మోడల్‌ స్కూల్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసాచారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు హారిక ఈనెల 10న ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అందుకు రాజేందరే కారణమని డీఈఓ ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెండ్‌ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయమై మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ రెడ్డిని వివరణ కోరగా ఉన్నతాధికారులు ఉపాధ్యా యుడు రాజేందర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement