పూడికతీత పనులు చేపట్టండి | Sakshi
Sakshi News home page

పూడికతీత పనులు చేపట్టండి

Published Tue, Apr 16 2024 1:00 AM

నాలాలను పరిశీలిస్తున్న కమిషనర్‌  - Sakshi

వరంగల్‌ అర్బన్‌: నగర వ్యాప్తంగా ఉన్న నాలాల్లో పూడికతీత పనులు వేగంగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా సోమవారం హనుమకొండ పద్మాక్షి కాలనీ రోడ్‌ న్యూశ్యాయంపేట బొంది వాగు నాలా, రైల్వే ట్రాక్‌ అవతలి వైపు ప్రాంతం, వరంగల్‌ మేదరివాడ రైల్వే ట్రాక్‌ వెంట్స్‌ ప్రాంతం కీర్తి బార్‌ ఏరియా శాకరాసి కుంట, జన్మభూమి జంక్షన్‌, మైసయ్య నగర్‌, శివనగర్‌ శ్మశాన వాటిక, ఖిలా వరంగల్‌ ప్రాంతాల్లో కమిషనర్‌ పరిశీలించారు. ఈసందర్భంగా పద్మాక్షి కాలనీ శాయంపేట వద్ద కాంట్రాక్టర్‌ నిలిపేసిన స్మార్ట్‌ సిటీ రోడ్డు పనుల్ని వెంటనే చేపట్టాలని ఎస్‌ఈని ఆదేశించారు. బొంది వాగు నాలాను పరిశీలించి వరద ప్రభావం వల్ల ఎదురయ్యే సమస్యల్ని అధికారులను అడిగి తెలుసుకొని డీ సిల్టింగ్‌ ప్రక్రియ ప్రారంభించి నీటి ప్రవాహానికి అడ్డంకుల్లేకుండా చూడాలని పేర్కొన్నారు. కరీమాబాద్‌ కీర్తి బార్‌ నుంచి గవిచర్ల క్రాస్‌ రోడ్డు వరకు సుమారు 3 కిలో మీటర్ల మేర నిర్మిస్తున్న స్మార్ట్‌ రోడ్డు పనుల్లో జాప్యం తగదదన్నారు. జన్మ భూమి జంక్షన్‌ సమీపంలో డ్రెయిన్‌లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని సీఎంహెచ్‌ఓను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, సీఎంహెచ్‌ఓ రాజేశ్‌, ఈఈ శ్రీనివాస్‌, డీఈలు రవికిరణ్‌, రంగారావు శానిటరీ సూపర్‌వైజర్‌ సాంబయ్య ఏఈలు సతీశ్‌ హబీబ్‌ మొజామిల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే

క్షేత్రస్థాయిలో తనిఖీ

Advertisement
 
Advertisement
 
Advertisement