వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి | Sakshi
Sakshi News home page

వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

Published Tue, Apr 16 2024 1:00 AM

రోగితో మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ 
వెంకటరమణ  - Sakshi

పర్వతగిరి: ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.వెంకటరమణ అన్నారు. సోమవారం పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఆస్పత్రిలో రోగులతో మాట్లాడారు. జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి వేడిగాలలు వీచడం పెరుగుతుందని, వడదెబ్బ తగలకుండా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి చేర్చి శరీరాన్ని చల్లని నీటిలో తడిపిన గుడ్డతో తూడవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలో 14, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 7, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 2, ఆరోగ్య ఉప కేంద్రాల్లో 118 రెస్పాండ్‌ టీంలను ఏర్పాటు చేశామన్నారు. గర్భిణులకు అందించే సేవలు క్రమ పద్ధతిలో అందించి మాతా శిశు మరణాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించేలా చూడాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సమయ పాలన పాటించాలన్నారు. ఎవరైనా అతిక్రమిస్తే వారిపై సీసీఏ రూల్స్‌ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాయపర్తిలో...

రాయపర్తి: వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలను పాటించేలా ప్రజలను చైతన్యం చేయాలని డీఎంహెచ్‌ఓ వెంకటరమణ పేర్కొన్నారు. సోమవారం మండలకేంద్రంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలను చైతన్యం చేసేలా వైద్యసిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ వెంకటరమణ

పీహెచ్‌సీల ఆకస్మిక తనిఖీ

Advertisement
 
Advertisement