మార్కెట్‌ మాయ! | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ మాయ!

Published Tue, Apr 16 2024 1:00 AM

మార్కెట్‌లో పత్తి బస్తాలపై దిగాలుగా కూర్చున్న రైతు (ఫైల్‌) - Sakshi

మంగళవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2024

8లోu

సాక్షి, వరంగల్‌: జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పంట తీసిన రైతన్నకు కనీస మద్దతు ధర లభించక అవసరం కోసం అప్పటికప్పుడూ అమ్మేసుకున్న అన్నదాతలు ప్రస్తుతం మార్కెట్‌లో పత్తికి ఉన్న ధరను చూసి తల్లడిల్లుతున్నారు. మార్కెట్‌ వ్యాపారుల మాయలో పడి ఇంకా రేటు తగ్గుతుందేమోనన్న భయంతో అమ్మేసిన కర్షకులు ఇప్పుడూ తలలు పట్టుకుంటున్నారు. తమ రెక్కల కష్టాన్ని వ్యాపారులు గద్దల్లాగా తన్నుకుపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనవరి, ఫిబ్రవరిలో రూ.ఆరువేలకు అటుఇటుగా ఉన్న పత్తి క్వింటా ధర.. మార్చి, ఏప్రిల్‌ నెలలో ఏకంగా రూ.7 వేలపైన ఉండడం గమనార్హం. నవంబర్‌ నుంచి జనవరి మధ్య కాలంలో చేతికి వచ్చిన ఈ పంటను దాదాపు ఫిబ్రవరి నెల వరకు రైతులు వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్‌తో పాటు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్మేశారు. 2023లో ప్రైవేట్‌ వ్యాపారులు మంచి ధరకు కొంటే ఈసారి ధర తగ్గడంతో వ్యాపారులతో పాటు రైతులు కూడా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. చేతికి వచ్చిన పంటను ధర లేనప్పుడు దాచుకొని, అవసరమైనప్పుడు అమ్ముకునేందుకు ప్రభుత్వపరంగా సౌకర్యాలు లేక ఎక్కువ మంది రైతులు పంట చేతికి రాగానే అమ్మేశారు. ఇంకా రానున్న రోజుల్లో ధర తగ్గుతుందని వ్యాపారుల ప్రచారంతో నిల్వ చేసుకునేవారు సైతం పత్తిని అమ్మేశారు. మొన్నటివరకు మద్దతు ధర కూడా దక్కని పత్తి ధర తాజాగా క్వింటాకు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రూ.వెయ్యికిపైగా పెరిగింది. అయితే ఇవి అన్నదాతలకు ఆందోళన కలిగిస్తే వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. కొనుగోలు సీజన్‌లో తక్కువగా ఉండే పంట ఉత్పత్తుల ధరలు.. క్రయవిక్రయాలు ముగిసే సమయంలో అమాంతంగా పెరిగిపోవడం గమనార్హం.

రెండు నెలల్లోనే పెరిగిన పత్తి ధర..

జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.ఐదు వేల నుంచి రూ.ఆరు వేలకుపైగా పలికిన పత్తి ధర మార్చి, ఏప్రిల్‌ నెలలో మాత్రం కనీస మద్దతు ధర కన్నా ఎక్కువగానే అమ్ముడయ్యాయి. అయితే కొనుగోలు సీజన్‌లో తక్కువ ధర ఉన్న పత్తిని కొనుగోలు చేసిన వ్యాపారులు ఇప్పుడు క్వింటాకు దాదాపు రూ.వెయ్యి కన్నా ఎక్కువగా విక్రయించి లాభపడుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏనుమాముల మార్కెట్‌కు లక్షల క్వింటాళ్లు రావడంతో వ్యాపారులు రూ.కోట్లలో లాభం గడించారన్న ప్రచారం ఉంది. 2023 ఫిబ్రవరిలో పత్తి క్వింటాకు రూ.6,200ల నుంచి రూ.7,760 పలికింది. ఈ ఏడాదిలో రూ.5,500ల నుంచి రూ.6,500ల మధ్య ధర ఉంది. ఒకరిద్దరూ రైతులకు మాత్రమే అది కూడా క్వింటా, రెండు క్వింటాలు ఉన్న రైతులకు మాత్రమే అత్యధిక ధర చెల్లుబాటు అయింది. 2023 మార్చి, ఏప్రిల్‌ లో రూ.ఆరువేల నుంచి రూ.7,405 వరకు ధర ఉంది. ఈ ఏడాది మార్చి 14న రూ.7,370, ఏప్రిల్‌లోనూ అదే ధర ఉంది. ఇంకా ఇప్పుడు పత్తి ధర పెరుగుతుండడంతో మార్కెట్‌కు వ్యాపారులు తీసుకొచ్చి సొమ్ము చేసుకుంటున్నారని పత్తి ఇప్పటికే విక్రయించిన వ్యాపారులు వాపోతున్నారు.

ఇప్పుడు అమ్ముకుంటే బాగుండేది..

నాకున్న రెండున్నర ఎకరాల్లో పత్తి సాగు చేశాను. పెట్టుబడి సు మారు రూ.60వేల వరకు అయింది. అ యితే పత్తి దిగుబడి 10 క్వింటాళ్ల వరకు మాత్రమే వచ్చింది. అ వసరం నిమిత్తం పత్తిని క్వింటాకు రూ.6,300 చొప్పున విక్రయించా. పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. ఇప్పుడు అమ్ముకుంటే బాగుండేది.

– ముస్కు సాంబయ్య, రైతు, చెన్నారావుపేట

కలెక్టర్‌ ప్రావీణ్య

న్యూస్‌రీల్‌

ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రకాశ్‌

రైతులు పత్తి అమ్ముకున్నాక పెరిగిన ధరలు

ఫిబ్రవరిలో క్వింటాకు

రూ.6వేలు మాత్రమే..

ఏప్రిల్‌ నెలలో ఏకంగా

రూ.7,240 పెరిగిన వైనం

వ్యాపారుల మాయలో

అన్నదాతలు ఆగమాగం

ధర పడిపోతుందనడంతో

త్వరగా విక్రయాలు

సంగెం మండలం నరసానగర్‌ గ్రామానికి చెందిన రైతు పేరు రోటి సతీష్‌. తనకున్న రెండున్నర ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా 17.5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పెట్టుబడికి రూ.80వేల ఖర్చు చేశారు. అయితే అప్పటికి ఆర్థిక భారం అధికం కావడంతో కొద్ది నెలల క్రితం క్వింటాకు రూ.5,500 ధరకు విక్రయించాడు. అంటే మొత్తంగా రూ.96,000ల ఆదాయం వచ్చింది. కొన్ని నెలల పాటు శ్రమిస్తే సతీష్‌కు కేవలం రూ.16 వేలు మాత్రమే మిగిలాయి. పత్తి పంటతో లాభం లేకపోవడంతో యాసంగిలో మొక్కజొన్న సాగు చేశాడు. అయితే ఇటీవల క్వింటా పత్తి ధర రూ.7,000లపైనే పలుకుతోంది.

1/4

2/4

3/4

4/4

Advertisement
 
Advertisement
 
Advertisement