ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

Published Wed, Nov 29 2023 1:22 AM

రాములు (ఫైల్‌)  - Sakshi

టేకుమట్ల: ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని బూర్నపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు ముంజాల రాములు (55) తనకున్న ఒకటిన్నర ఎకరాల వ్యవసాయ భూమిలో వరి, పత్తి పంటలు సాగు చేశాడు. కాగా, ఆగస్ట్‌లో కురిసిన భారీ వర్షాలకు వరి పంట పూర్తిగా ధ్వంసమైంది. పత్తి దిగుబడి సరిగా లేక భారీగా నష్టపోయాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం తన ఇంట్లోనే గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు గమనించి రాములును చిట్యాల సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. రాములు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గట్ల సుధాకర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement