విద్య ద్వారానే వ్యవస్థ నిర్మాణం | Sakshi
Sakshi News home page

విద్య ద్వారానే వ్యవస్థ నిర్మాణం

Published Wed, Nov 29 2023 1:22 AM

మాట్లాడుతున్న వీసీ రమేశ్‌ - Sakshi

కేయూ క్యాంపస్‌: విద్య ద్వారానే వ్యవస్థ నిర్మాణమవుతుందని కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య తాటికొండ రమేశ్‌ అన్నారు. మంగళవారం కేయూలో బీసీ సెల్‌ ఆధ్వర్యంలో మహాత్మాజ్యోతిరావు పూలే వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వీసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహనీయుల సంస్కరణల ద్వారా వచ్చిన మార్పులు ఆచరణలో అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. జ్యోతిరావు పూలే స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు. కేయూ రిటైర్డ్‌ ఆచార్యుడు కె మురళీమనోహర్‌ మాట్లాడుతూ దేశంలో ఇంకా నిరక్ష్యరాస్యత ఉందన్నారు. సామాజిక సంస్కరణలు ఇంటివద్దనుంచే ప్రారంభం కావాలన్నారు.అందుకు జ్యోతిరావుపూలేనే ఆదర్శమన్నారు. కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య టి శ్రీనివాస్‌రావు , కేయూ ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్‌ గాదె సమ్మయ్య, కేయూ బీసీ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ శ్రీనివాస్‌ మాట్లాడారు. తొలుత కేయూ దూరవిద్యకేంద్రంలోని మహాత్మాజ్యోతిరావుపూలే,సావిత్రిబాయిపూలే దంపతుల విగ్రహాలకు వీసీ రమేశ్‌, ఇతర ఆచార్యులు పూలమాలలువేసి నివాళులర్పించారు. ప్రొఫెసర్‌ వి రాంచంద్రం, ఆచార్య రాంనాథ్‌ కిషన్‌, ప్రొఫెసర్‌ గాదె సమ్మయ్య, ప్రొఫెసర్‌ వి కృష్ణమాచార్య, తదితరులు పాల్గొన్నారు.

కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేశ్‌

Advertisement
 
Advertisement