విద్యార్థుల వివరాల నమోదులో జాగ్రత్త
విద్యార్థుల వివరాల నమోదులో ఆందోళన వద్దు
పదో తరగతి విద్యార్థుల వివరాలు నామినల్ రోల్స్‌లో ఎంట్రీ చేసేందుకు ఆందోళన చెందొద్దు. గడువు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలి. నమోదు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ప్రతి అక్షరం చెక్ చేయాలి.గడువు ఇచ్చే అవకాశం ఉంది కదా అని నిర్లక్ష్యంగా చేయకూడదు.
– బి.మోహనరావు, డీఈఓ, విజయనగరం
ఈ ఏడాది గందరగోళం
ఈ ఏడాది యూడైస్ ప్రామాణికంగా నామినల్ రోల్స్‌లో విద్యార్థుల వివరాలు నమోదుకు గందగోళంగా ఉంది.గతంలో ఇలా ఎప్పుడూ లేదు. అన్‌లైన్‌లో విద్యార్థుల వివరాలు నమోదు చేసేటప్పుడు పొరపాటున తప్పు దొర్లితే సరిదిద్దేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు.దాంతో ఇబ్బందిగా ఉంది.యూడైస్ ప్లస్‌లో ఎడిట్,సేవ్ సబ్‌మిట్ ఆప్షన్,బీఎస్‌ఈ సైట్‌లో కూడా ఎడిట్,సేవ్ సబ్‌మిట్ ఆప్షన్స్ లేకుండా కేవలం యూడైస్ ప్లస్‌లో మాత్రమే సబ్‌మిట్ ఆప్షన్ పెట్టడం వల్ల 24 గంటల తర్వాత బీఎస్‌ఈ సైట్‌లో డేటా రిఫ్లెక్ట్ కావడం ఇబ్బందిగా ఉంది.విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం వివరాల నమోదు తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇస్తామంటున్నారు.
– వి.గోపాలనాయుడు,
హెచ్‌ఎం, ఉన్నత పాఠశాల రామభద్రపురం
రామభద్రపురం/మెరకముడిదాం: విద్యార్థులకు పదవ తరగతి సర్టిఫికెట్ ఎంతో కీలకం.మార్కులొక్కటే కాదు.. అందులో నమోదయ్యే వివరాలు కూడా ముఖ్యమే. భవిష్యత్‌లో ఉన్నత చదువులకే కాకుండా ఉపాధి అవకాశాలకు పదో తరగతి సర్టిఫికెట్‌లోని వివరాలే ప్రధానం.ఇంతటి ప్రాధాన్యం కలిగిన మార్కుల జాబితాల్లో విద్యార్థుల వివరాల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాల్సిన అవసరం ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థుల తల్లిదండ్రులపై ఉంది. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు 16,287 మంది. ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 6,878 మంది మొత్తం 23,165 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. తాజాగా ఆన్‌లైన్‌లో వారి నామినల్ రోల్స్ ఎంట్రీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పకడ్బందీగా విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని, తప్పొప్పులు నమోదు కాకుండా చూడాలని, విద్యార్థుల వివరాల నమోదులో నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్‌లో విద్యార్థులకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. నామినల్ రోల్స్ చేయించుకునేటప్పుడు ఆపార్‌లో అన్ని వివరాలు అప్‌డేట్ ఉండాలి. దీంతో పదో తరగతి నామినల్ రోల్స్ ఎంట్రీ కోసం ఈ నెల 6 వ తేదీ గడువు కావడంతో వివరాల నమోదులో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు నిమగ్నమై ఉన్నారు.అలాగే ఆన్‌లైన్‌లో నామినల్ రోల్స్‌కు సంబంధించి వివిరాలు నమోదు చేసే సమయంలో పొరపాటున తప్పులు దొర్లితే సరిదిద్దేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో ఇబ్బందిగా ఉందని హెచ్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్‌లో ఇబ్బంది
పదో తరగతి నామినల్ రోల్స్
ఎంట్రీలో జాగ్రత్తలు అవసరం
ఈ నెల 6వ తేదీ వరకు గడువు
ఆన్‌లైన్‌లో ఎడిట్ ఆప్షన్
ఇవ్వకపోవడంతో హెచ్‌ఎంల
ఇబ్బందులు
విద్యార్థుల వివరాల నమోదులో జాగ్రత్త
విద్యార్థుల వివరాల నమోదులో జాగ్రత్త
విద్యార్థుల వివరాల నమోదులో జాగ్రత్త


