సమర్థంగా విధుల నిర్వహణకు ఆరోగ్యం ముఖ్యం
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి
పార్వతీపురం: జిల్లా పరిపాలనా యంత్రాంగం సమర్థవంతంగా విధులను నిర్వహించాలంటే ఆరోగ్యం ముఖ్యమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులు, సిబ్బంది కోసం ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లా అబివృద్ధిలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది ఆరోగ్యం చాలా ముఖ్యమన్నారు. సిబ్బంది ఆరోగ్యం, శ్రేయస్సు దృష్ట్యా ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ శిబిరంలో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, అంకాలజీ, జాయింట్ రీప్లేస్‌మెంట్, ఎకో, ఈసీజీ తదితర పరీక్షలను నిర్వహించి అనుభవజ్ఞులైన వైద్యులతో చికిత్సలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా.పి.భాస్కరరావు, డీసీహెచ్‌ఎస్ డా.జి.నాగభూషణరావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డా.ఎం.వినోద్, ప్రోగ్రాం మేనేజర్ డా.టిజగన్‌మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.


