13న జాతీయ లోక్ అదాలత్‌ను జయప్రదం చేయండి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత
విజయనగరం లీగల్: ఈనెల 13న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కోర్టు పరిధిలో ఉన్న న్యాయమూర్తులందరితో ఆమె సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద కేసులు, బ్యాంకుకేసులు, చెక్‌బౌన్స్, మనీ కేసులు, ప్రాంసరీ నోట్ కేసులు, పర్మినెంట్ ఇంజక్షన్ దావాలు, ఎకై ్సజ్, ల్యాండ్ కేసులు, మున్సిపాలిటీ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులకు ఇరు పార్టీల అనుమతితో రాజీమార్గంలో శాశ్వత పరిష్కారం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు మొదటి న్యాయమూర్తి ఎం.మీనా దేవి, మూడవ అదనపు న్యాయమూర్తి కె.విజయకల్యాణి, నాల్గవ అదనపు న్యాయమూర్తి బి.అప్పలస్వామి, ఐదవ అదనపు న్యాయమూర్తి ఎం.పద్మావతి, పోక్సోకోర్టు జడ్జి కె.నాగమణి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి. దుర్గయ్య,సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


