ముగిసిన రాష్ట్ర స్థాయ చదరంగం పోటీలు
విజయనగరం అర్బన్: పట్టణంలోని ఇన్‌స్పిరో లార్వెన్స్ స్కూల్‌లో జరిగిన అండర్–15 ఓపెన్ చదరంగ (చెస్) రాష్ట్ర స్థాయి పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆరు జిల్లాల నుంచి సుమారు వందమంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. వివిధ విభాగాల్లో మొత్తం 60 మంది విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో అండర్–11 విభాగంలో పర్వేశ్‌కు స్టేట్ ఫస్ట్, అండర్–13 బాలికల విభాగంలో జాస్మిస్ స్టేట్ ఫస్ట్, అలాగే అండర్–13 విభాగంలో ఆర్‌వీ మాధురి మోక్షిత ద్వితీయ స్థానంలో నిలిచారు. టోర్నమెంట్ నిర్వహణలో జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బీఏరావు, కార్యదర్శి ఏడీఎస్‌ఎస్‌వీప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా లార్వెన్స్ స్కూల్ డైరెక్టర్ మండా రవి, శ్రీకాకుళం చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.భీమారావు, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి అదృశ్యం
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మావతి నగర్‌కు చెందిన కోసల ధర్మేంద్ర (33) అదృశ్యమయ్యా డు. ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. నగర శివారులోని పద్మావతినగర్‌లో ఉంటున్న కోసల ఽపెదబాబు కొడుకు ధర్మేంద్ర అక్టోబర్ పదవ తేదీన ఇంట్లోంచి వెళ్లి పోయాడు. అప్పటి నుంచి చుట్టుపక్కల స్థానికులు, బంధువులు, స్నేహితులను వాకబు చేసినా అచూకీ దొరకలేదు. ఈ మేరకు రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన కొడుకు కనిపించకుండా పోయాడని పెదబాబు సోమవారం ఫిర్యాదు చేశాడని రూరల్ ఎస్సై అశోక్ తెలిపారు. పెళ్లయి ఇద్దరు పిల్లలున్న ధర్మేంద్రకు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని, తమకు వచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
సర్వజన ఆస్పత్రి సిబ్బంది అలసత్వం
● పక్షవాతం రోగికి ఇంజక్షన్
చేయడంలో నిర్లక్ష్యం
● రోగి బంధువులు పలుమార్లు
అడిగినా పట్టించుకోని సిబ్బంది
విజయనగరం ఫోర్ట్: పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిన రోగికి వైద్యుడు సూచించిన ఇంజక్షన్లు చేయడంలో వైద్య సిబ్బంది అలసత్వం వహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంట్యాడ మండలానికి చెందిన బి.అప్పారావుకు మూతివంకరపోయి, మాట రాకపోవడంతో వారి బంధువులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆదివారం చేర్పించారు. క్యాజువాలిటీలో చూపించిన అనంతరం మేల్ మెడికల్ వార్డుకు తరలించారు. సోమవారం ఉదయం రౌండ్స్ వేసిన వైద్యులు అతనికి స్ట్రోక్ తగ్గడానికి అవసరమైన ఇంజక్షన్లు కేషీట్‌పై రాసి వాటిని అప్పారావుకు చేయాలని సూచించారు. అయితే అ ఇంజక్షన్లు రోగి బెడ్‌పైనే నర్సింగ్ సిబ్బంది పెట్టి వదిలేశారు. ఇంజక్షన్లు చేయాలని పలుమార్లు నర్సింగ్ సిబ్బందిని రోగి బంధువు అడిగినప్పటికీ పట్టించుకోలేదు. మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఇంజక్షన్లు అలాగే వదిలేశారు. మధ్యాహ్నం డ్యూటీకి వచ్చిన నర్సింగ్ సిబ్బంది దగ్గరకు రోగి బంధువు వెళ్లి ఇంజక్షన్లు అలానే వదిలేశారు. చేయండని చెబితే అప్పడు వచ్చి నాలుగు గంటల సమయంలో ఇంజక్షన్లు చేశారు. ఇదేవిషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ వద్ద సాక్షి ప్రస్తావించగా ఎందుకు ఇంజక్షన్లు చేయడంలో జాప్యం చేశారో విచారణ చేపడతామని తెలిపారు.
సాలూరులో
అభ్యుదయం సైకిల్ యాత్ర
సాలూరు: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఎస్పీ మాదవరెడ్డి ఆధ్వర్యంలో సాలూరు పట్టణంలో అభ్యుదయం సైకిల్ యాత్ర సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీతో పాటు సీ్త్ర శిశు సంక్షేమ,గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి డీలక్స్ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి నిర్వహించిన భారీ ర్యాలీలో సీఐలు అప్పలనాయు డు, రామకృష్ణ, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, ప లువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన రాష్ట్ర స్థాయ చదరంగం పోటీలు
ముగిసిన రాష్ట్ర స్థాయ చదరంగం పోటీలు
ముగిసిన రాష్ట్ర స్థాయ చదరంగం పోటీలు


