ఆశ వర్కర్ సేవలకు అవార్డు
మెంటాడ: మోంథా తుఫాన్ ప్రభావంతో వర్షాలు జోరందుకున్నవేళ.. మెంటాడ మండలం జగన్నాథపురానికి చెందిన మీసాల పార్వతి అనే గర్భిణికి పురిటినొప్పులు ఆరంభమయ్యాయి. విషయం తెలుసుకున్న ఆశ కార్యకర్త వై.బంగారమ్మ వెంటనే గర్భిణి వద్దకు చేరుకుంది. సపర్యలు చేస్తూనే ఆటోలో ఆండ్ర రిజర్వాయర్ కాలువ గట్టు గుండా ఆస్పత్రికి తరలించింది. తల్లీబిడ్డకు అండగా నిలిచింది. ఈ విషయాన్ని స్థానిక వైద్యాధికారులు ఉన్నత వైద్యాధికారులు, ప్రభుత్వానికి నివేదించడంతో సీఎం ప్రశంసించారు. అమరావతిలో శనివారం అవార్డును అందజేశారు.
భయపెడుతున్న డయేరియా
రామభద్రపురం: మండలంలో డయేరియా మహమ్మారి కోరలు విప్పింది. మొన్న ముచ్చర్లవలసలో 15 మంది, నిన్న ఇట్లామామిడిపల్లి, నేడు కొండకెంగువ, ఆరికతోటలో అతిసార ప్రబలింది. కొండకెంగువ గ్రామానికి చెందిన సిరిపురం సంధ్య, చింత రవణమ్మ, ఆరికతోట గ్రా మం బీసీ కాలనీకి చెందిన కనకల గౌరిలు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ బాడంగి సీహెచ్‌సీలో శనివారం చేరారు. తాగునీటి కలుషి తం వల్లే డయేరియా ప్రబలిందంటూ పంచాయతీరాజ్ అధికారులు.. కాదు పారిశుద్ధ్య లోపమే కారణమని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తలోమాట చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకో గ్రామంలో అతిసార వ్యాప్తి తో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ప్రాణాలు తీస్తున్న మద్యం వ్యసనం
● మద్యం డబ్బుల కోసం కన్నవారితో వాగ్వాదం
● మత్తులో విచక్షణ కోల్పోయి ప్రాణాలు తీస్తున్న వైనం
● వరుస ఘటనలతో ఉలికిపాటు
● విచ్చలవిడిగా మద్యం అమ్మకాలపై ఆందోళన
బాడంగి: పల్లెలు, పట్టణాల్లో విచ్చలవిడిగా దొరకుతున్న మద్యానికి కొందరు బానిసలుగా మారుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మత్తులోనే జోగుతున్నారు. మద్యం కొనుగోలుకు అవసరమైన రూ.200, 300లకు కన్నవారు, బంధువులు, తోబుట్టువులతో గొడవకు దిగుతున్నారు. డబ్బులు చేతికందేవరకు వాగ్వాదం చేస్తున్నారు. మద్యం వద్దు అని చెప్పిన వారిపై విచక్షణ కోల్పోయి దాడులకు తెగబడుతున్నారు. కన్నవారి ప్రాణాలు తీస్తున్నారు. బాడంగి మండలంలో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు సొంత తండ్రులను హతమార్చిన ఘటనలు వరుసగా జరగడంతో ప్రజలు ఉలికిపాటుకు గురయ్యారు. మద్యం మహమ్మారి పేద, మధ్యతరగతి కుటుంబాలను పొట్టనపెట్టుకుంటోందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎక్కడికక్కడే మద్యం దొరకడంతో జీవితాలు నాశనమవుతున్నాయంటూ వా పోతున్నారు. గత నెల 9వ తేదీన మద్యం కొనుగోలుకు డబ్బులివ్వలేదన్న కోపంతో బాడంగి మండల కేంద్రంలోని సినిమా కాలనీకి చెందిన భువనగిరి లక్ష్మణరావు తన తండ్రి రాజేశ్వరరావు ను చెప్పులకు మేకులు చరిచే గూటంతో తల, చెవిపై మోది హత్య చేశాడు. శనివారం ఈ ఘట న మరువకముందే గొల్లాదిలో మద్యంమత్తులో మామిడి రాము అనే వ్యక్తి పక్షవాతంతో రెండేళ్లుగా మంచంపట్టిన తండ్రి మామిడి సత్యంను శనివారం కత్తితో తలనరికి హత్యచేశాడు. ఈ ఘటనలను చూసిన పోలీసులు సైతం ఏం చేస్తే ఈ హత్యలు ఆగుతాయన్న ఆలోచనలో పడ్డారు.
ఆశ వర్కర్ సేవలకు అవార్డు
ఆశ వర్కర్ సేవలకు అవార్డు


