ఈ చిత్రాలు చూశారా.. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో వరండాలో చదువులు సాగుతున్నది సంతకవిటి మండలంలోని బూరాడపేట ప్రాథమిక పాఠశాల. ఇక్కడ 21 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో రెండు తరగతి గదులు ఉండగా ఒక గది పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో దానిని వదిలేశారు. మరో తరగతి గది కూడా వర్షానికి కారిపోవడం, శ్లాబు పెచ్చులూడి పడుతుండడంతో వరండాలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. పాలకులు, అధికారులు స్పందించి పాఠశాలకు నూతన భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. – సంతకవిటి
● వరండాలోనే చదువులు


