రామతీర్థానికి పోటెత్తిన భక్తులు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామివారి దర్శనానికి భక్తులు శనివారం పోటెత్తారు. కార్తీకమాసం తొలి ఏకాదశి కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా రామకోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను విడిచిపెట్టారు. అనంతరం సీతారామస్వామికి పూజలు చేశారు. యాగశాలలో అర్చకులు విశేష హోమాలు జరిపించిన తర్వాత వెండి మండపంలో స్వామి నిత్యకల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.


