వంశధారలో మహిళ గల్లంతు
● కార్తీక స్నానాలలో దుర్ఘటన
భామిని: మండలంలోని కాట్రగడ బీకి చెందిన గౌడో జడ్జి అనే మహిళ వంశధార నదిలో శనివారం గల్లంతైనట్టు స్థానికులు తెలిపారు. కార్తీక ఏకాదశి సందర్భంగా వేకువజామున నదిలో కార్తీక స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో కొట్టుకుపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్రామస్తులు నదిలో వెతికినా జాడ లభించకపోవడంతో అధికారులకు తెలిపారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ శివన్నారాయణ, ఎంపీడీవో వసంతకుమారి, బత్తిలి ఎస్.ఐ అప్పారావు, ఎంఆర్‌ఐ మణి ప్రభాకర్ ఆధ్వర్యంలో అధికారులు గల్లంతైన మహిళ విషయమై పరిశీలించారు. నదీ తీరం వెంబడి వెతికేందుకు ప్రత్యేక బృందాల రప్పించనున్నట్టు అధికారులు తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు తోట సింహాచలం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు.


