కాశీబుగ్గలో జిల్లా పోలీసుల సహాయక చర్యలు
విజయనగరం క్రైమ్: పొరుగు జిల్లా శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో కార్తీక శుద్ద ఏకాదశి సందర్భంగా శనివారం జరిగిన తొక్కిసలాటలో జిల్లా పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఎస్పీ దామోదర్ తోటి సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యల్లో భాగస్వామ్యం అయ్యారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ సౌమ్యలత, ఏఆర్ ఎస్పీ నాగేశ్వరరావు, ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం కోసం తమ వంతు సేవలు అందించారు. గాయపడిన క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.


