
పోలీస్ సంక్షేమ పాఠశాలకు వసతి కల్పన
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కంటోన్మెంట్ పోలీస్‌లైన్స్‌లో నిర్వహిస్తున్న శార్వాణి పోలీస్ సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎస్పీ వకుల్ జిందల్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇక్కడి పాఠశాలలో తక్కువ ఫీజులకే పోలీసుల పిల్లలకు, ఇతర విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు వెల్లడించారు. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు 682 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అదనపు తరగతి గదులను శ్రమదానంతో నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, అదనపు ఎస్పీ (ఎఆర్) జి.నాగేశ్వరరావు, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐలు ఎ.వి.లీలారావు, ఆర్‌వీఆర్‌కే చౌదరి, ఆర్‌ఐ లు ఎన్.గోపాలనాయుడు, ఆర్.రమేష్‌కుమార్, టి.శ్రీనివాసరావు, హెచ్‌ఎం సంధ్య పాల్గొన్నారు.
నాలుగు అదనపు గదుల నిర్మాణానికి ఎస్పీ వకుల్ జిందల్ శంకుస్థాపన