పాలిసెట్‌లో 92.38 శాతం ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌లో 92.38 శాతం ఉత్తీర్ణత

May 6 2026 8:55 AM | Updated on May 6 2026 8:55 AM

మురళీనగర్‌ : ఏపీ పాలిసెట్‌ –2026 ఫలితాల్లో విఽశాఖపట్నం జిల్లా 92.38 శాతం ఉత్తీర్ణత సాధించింది. 14,118 విద్యార్థులకు 13,042 మంది ఉత్తీర్ణత సాధించినట్టు జిల్లా పాలిసెట్‌ సమన్వయకర్త కేవీ రమణ తెలిపారు. జిల్లాకు చెందిన జామి చేతన్‌ రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు, శీలం హేమచంద్ర తొమ్మిదో ర్యాంకు, గొర్లె బాలాదిత్య 12 ర్యాంకు సాధించినట్టు పేర్కొన్నారు. వీరందరూ 120 మార్కులకు 120 మార్కులు సాధించినట్టు తెలిపారు.

చేతన్‌ (3వ ర్యాంక్‌), హేమచంద్ర (9వ ర్యాంక్‌), బాలాదిత్య (12వ ర్యాంక్‌)

120/120 మార్కులు

సాధించిన జిల్లా విద్యార్థులు

Advertisement
 
Advertisement
Advertisement