సమసమాజం కోసం అంబేడ్కర్ కృషి
సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం కృషి చేసిన డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో, డాబాగార్డెన్స్‌లోని అంబేడ్కర్ విగ్రహాలకు జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేడ్కర్ సిద్ధాంతాలను పాటించడం ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిజమైన సామాజిక న్యాయాన్ని రాష్ట్రంలో అమలు చేశారన్నారు. తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, డిప్యూటీ మేయర్ కె. సతీష్, మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎస్‌ఈసీ సభ్యులు జహీర్ అహ్మద్, సతీష్ వర్మ, సంయుక్త కార్యదర్శి తాడి జగన్నాథరెడ్డి, రాష్ట్ర, జోనల్ విభాగాల అధ్యక్షులు జాన్ వెస్లీ, పేర్ల విజయ్‌చందర్, ద్రోణంరాజు శ్రీ వత్సవ్, ముట్టి సునీల్ కుమార్, ఉరుకుటి రామచంద్రరావు, పేడాడ రమణి కుమారి, సనపల రవీంద్ర భరత్, సేనాపతి అప్పారావు, కర్రి రామ రెడ్డి, శ్రీదేవి వర్మ, వాసుపల్లి ఎల్లాజీ, వంకాయల మారుతీప్రసాద్, నీలి రవి, మాజీ చైర్మన్లు అల్లంపల్లి రాజబాబు, పల్లా చిన్నతల్లి, నాయకులు శశికళ, బిపిఎన్ కుమార్ జైన్, మువ్వల లక్ష్మి, కోమటి శ్రీనివాసరావు, పల్లా దుర్గారావు, రామన్న పాత్రుడు, మల్లేశ్వరి, చొక్కర శేఖర్ తదితరులు పాల్గొన్నారు. – మహారాణిపేట
సమసమాజం కోసం అంబేడ్కర్ కృషి


