పైరు పోయింది.. కన్నీరు మిగిలింది
7వ పేజీ తరువాయి
రైతులు చెబుతున్నారు. నీట ముంపునకు గురైన వరి మొదళ్లు కుళ్లిపోయాయనీ.. మళ్లీ పంటని నిలబెట్టుకోవాలంటే.. నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాతే సాధ్యమవుతుందని రైతులు చెబుతున్నారు. అయితే వరద నీరు మొత్తం పోయేందుకు మరో 15 రోజుల సమయం పడుతుందని ఈలోగా.. పంట మొత్తం కుళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నీరు ఎండిపోయే దశలో ఉన్నా.. పంట బతికించుకోవాలంటే ఎరువులు అవసరమనీ.. అయితే ఎరువులు సక్రమంగా దొరికే పరిస్థితి లేకపోవడంతో.. వాటిపైనా ఆశలు వదిలేసుకున్నామంటూ రైతులు వాపోతున్నారు.
ఉద్యానవన శాఖ ఎక్కడ.?
ఉద్యానవన శాఖ అధికారుల తీరైతే మరీ దారుణం. ఇంతవరకూ ఏ ఒక్క హార్టికల్చర్ అధికారీ.. ముంపు ప్రాంతాల్లో పర్యటించలేదని కొందరు గ్రామస్తులు చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో మిరప, బొప్పాయి పంటలు ధ్వంసమయ్యాయి. అయినా. హార్టికల్చర్ అధికారులు మాత్రం ఉద్యాన పంటలు ఎక్కడా నష్టం వాటిల్లలేదని నివేదికలు ఇవ్వడం గమనార్హం.


