పైరు పోయింది.. కన్నీరు మిగిలింది
మిగతా 8వ పేజీలో
మోంథా తుపాను ఆరుగాలం శ్రమించే రైతన్నకు గుండెకోతను మిగిల్చింది. ఖరీఫ్‌పైనే ఆశలు పెట్టుకున్న అన్నదాతకు వేదన మిగిల్చింది. వరద ముంపు ముప్పును అంచనా వేయడంలో ప్రభుత్వ వైఫల్యం.. రైతుల్ని నిలువునా ముంచేసింది. మోంథా వెళ్లి.. మూడు రోజులైనా.. ఇంకా పొలాలు చెరువులుగానే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టి.. పంట కోసం ఎదురుచూస్తున్న రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. భరోసా ఇవ్వాల్సిన సర్కారు.. బూటకపు మాటలు మాట్లాడుతోంది. పంట నష్టం పక్కాగా అంచనా వెయ్యాల్సిన అధికారులు.. ౖపైపె లెక్కలతో మమా అనిపించేశారు. జిల్లాలో మొత్తం 5 మండలాలు తుపాను ప్రభావిత మండలాలుగా మారగా.. ఇందులో 350 ఎకరాలకు పైగా పంటలు వర్షార్పణం కాగా.. అధికారులు మాత్రం.. కేవలం 286 ఎకరాల పంటే నష్టం వాటిల్లిందని
కాకి లెక్కలు చూపిస్తున్నారు.
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లాలో 11 మండలాలుండగా వ్యవసాయ సాగు మండలాలు నాలుగు ఉన్నాయి. భీమిలి నియోజకవర్గంలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలతో పాటు పెందుర్తి మండలంలోనూ తుపాను బీభత్సం సృష్టించింది. అధికారులు ఈ నాలుగు మండలాల్లో కేవలం 286.88 ఎకరాల్లో మాత్రమే వరిపంటకు నష్టం వాటిల్లిందని చూపిస్తున్నా.. వాస్తవానికి మాత్రం దాదాపు 350 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో రైతులను కలిసి.. ఊరికి సమీపంలో ఉన్న పొలాలు చూసి.. తూతూ మంత్రంగానే నష్ట అంచనాను నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఉద్యాన పంటలకు సంబంధించిన నష్టం అంచనా వేసేందుకు అధికారులు కనీసం గ్రామాల్లోకి రాలేదని
పొడుగుపాలెంలో నీటమునిగిన వరిచేను
పెట్టుబడి అంతా గంగలో కలిసిపోయింది
సప్టా నుంచి నీరు కొట్టుకురావడం వల్ల 2 ఎకరాల పొలం మొత్తం మునిగిపోయింది. ఎకరానికి సుమారు రూ.30 వేల వరకూ పెట్టుబడి పెట్టాం. ఇప్పు డు నీరు తప్ప పొలంలో ఏమీ కనిపించడం లేదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడంలేదు. ప్రభుత్వం కూడా ఇంతవరకూ ఎలాంటి హామీ ఇవ్వలేదు.
–బంటుబిల్లి జోగినాయుడు, రైతు, పొడుగుపాలెం
మూడెకరాలు మునిగిపోయాయి
3 ఎకరాల వరి పొలం వెన్ను దశకు చేరుకుంది. పంట బాగా వస్తుందని అనుకున్నాం. కానీ తుపాను మా ఆశలను చిదిమేసింది. మోకాలు లోతు నీళ్లలో పంట ఉండిపోయింది. మొత్తం చేనంతా కుళ్లిపోయింది. మళ్లీ ఎరువులు వేస్తే బతికే అవకాశం ఉన్నా.. నీరు పోయేందుకు మరో 5 రోజులు పడుతుంది.
–పశురెడ్డి గురుమూర్తి, రైతు, ఏనుగుల పాలెం
పైరు పోయింది.. కన్నీరు మిగిలింది
పైరు పోయింది.. కన్నీరు మిగిలింది
పైరు పోయింది.. కన్నీరు మిగిలింది
పైరు పోయింది.. కన్నీరు మిగిలింది


