జలంలో జనం.. పడవపై గంటా
పెదనాగమయ్యపాలెంలో ఎమ్మెల్యే చుట్టపుచూపు
పెదనాగమయ్యపాలెం గ్రామం వరద నీటితో చిక్కుకోగా.. బుధవారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వారి గోడు వినడానికి వచ్చారు. అయితే ప్రజలు నీటితో ఇబ్బందులు పడుతుంటే.. ఆయన మాత్రం పడవ ఎక్కారు. గ్రామం ఎంత మేర నీటిలో తేలుతుందో పరిశీలించినట్లుగా సాగింది ఆయన పర్యటన! కనీసం ఆదుకుంటాం అనే ఒక్క హామీ మాట అయినా చెప్తారేమో అని ఆశగా ఎదురుచూసిన మత్స్యకారులకు నిరాశే మిగిలింది. బంధువుల ఇంటికి వచ్చిన చుట్టపులా.. కాసేపు పడవపై షికారు చేసి ఆయన వెళ్లిపోయారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బహుశా వరద సమయంలో బోటింగ్ అనుభూతిని పరిశీలించడానికి, ఆపై ఫొటోలకు ఫోజులివ్వడానికి మాత్రమే ఆయన ఈ పర్యటన చేపట్టారేమో అని ప్రజలు గుసగుసలాడారు.


