విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాల్లో ఏపీఎస్‌పీడీసీఎల్ స
విశాఖ సిటీ : మోంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యల్లో భాగంగా తిరుపతి నుంచి ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ బుధవారం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే ఏపీఎస్‌పీడీసీఎల్ నుంచి సుమారు 1,500 మంది అధికారులు, సిబ్బంది తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. సీఎండీ శివశంకర్, ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్లు డి.చంద్రం, టి.వనజ, సీజీఎం వి.విజయలలిత, ఎస్‌ఈ సురేఖ తదితరులతో సమావేశమై క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన మెటీరియల్ సరఫరా, మద్దతు చర్యలపై సమీక్షించారు.


