కొండచిలువ కలకలం | - | Sakshi
Sakshi News home page

కొండచిలువ కలకలం

Oct 29 2025 8:05 AM | Updated on Oct 29 2025 8:05 AM

కొండచ

కొండచిలువ కలకలం

ఆరిలోవ: జీవీఎంసీ 12వ వార్డు పరిధి టి.ఐ.సి పాయింట్‌ సమీపం క్రాంతినగర్‌లో మంగళవారం ఉదయం ఒక కొండచిలువ కలకలం రేపింది. కంబాలకొండ వెనుక భాగాన్ని ఆనుకొని ఈ కాలనీ ఉంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ ప్రాంతం నుంచి కొండచిలువ ఈ కాలనీలోకి ప్రవేశించింది. రోడ్డు పక్కన చిన్న కాలువలో చేరిన సుమారు 12 అడుగుల ఈ పామును స్థానికులు గమనించి ఆందోళనకు గురయ్యారు. కొందరు భయంతో ఇళ్ల తలుపులు మూసుకున్నారు. స్థానిక యువకులు ధైర్యం చేసి ఆ పామును చాకచక్యంగా పట్టుకుని ఖాళీ డ్రమ్ములో వేశారు. అనంతరం అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చి అప్పగించారు. కొండ ప్రాంతం నుంచి పాములు రాకుండా నివాసాలను ఆనకుని ఇనుప మెస్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు జీవీఎంసీ అధికారులను కోరుతున్నారు.

కొండచిలువ కలకలం1
1/1

కొండచిలువ కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement