నవంబర్ 30న వైజాగ్ మారథాన్
ఏయూక్యాంపస్: ఆరోగ్యం, ఐక్యతను ప్రోత్సహించే సంధ్యామైరెన్ వైజాగ్ మారథాన్–4 ను నవంబర్ 30న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన టీ షర్ట్, మెడల్స్‌ను బీచ్ రోడ్డులో ఆవిష్కరించారు. ఈ సంవత్సరం 5 కి.మీ., 10 కి.మీ., 21 కి.మీ. పరుగులతో పాటు కొత్తగా 32 కిలోమీటర్ల విభాగాన్ని కూడా ప్రవేశపెడుతున్నట్లు సంధ్యా మైరెన్ ప్రతినిధి కె. ఆనంద్ తెలిపారు. వైజాగ్ రన్నర్స్ సొసైటీ కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ అనుకూల, మాదకద్రవ్య రహిత విశాఖను ప్రోత్సహించడమే ఈ మారథాన్ ఉద్దేశమని తెలిపారు. ఈ ఏడాది టీ–షర్ట్‌ను భూమి నుంచి స్ఫూర్తి పొంది ఆకుపచ్చ రంగులో రూపొందించారు. కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ కృష్ణ ప్రసాద్, లక్ష్మి, ప్రద్యుమ్న, రవి కట్టా, టి.వి.ఎన్ సత్యమూర్తి, డాక్టర్ ఎస్.రాజు, వైజాగ్ వలంటీర్స్ సతీష్ తదితరలు పాల్గొన్నారు.


