సిటీ ఆపరేషన్ సెంటర్ పరిశీలన
డాబాగార్డెన్స్: తుఫాన్ నేపథ్యంలో నగరంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తక్షణమే చేపట్టాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సిటీ ఆపరేషన్ సెంటర్‌ను, పునరావాస కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెట్లు, హోర్డింగ్‌లు కూల కుండా చర్యలు తీసుకోవాన్నారు. శిథిలావస్థ భవనాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. విద్యుత్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. సిటీ ఆపరేషన్ సెంటర్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, అన్ని జోన్ల కార్యాలయాలకు టోల్ ఫ్రీ నంబర్, ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచామన్నారు.


