మేహాద్రి రిజర్వాయర్ గేటు ఎత్తివేత
రెండో గేటు నుంచి
1,050 క్యూసెక్కుల నీరు విడుదల
పెందుర్తి : తుఫాన్ కారణంగా మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌కు సోమవారం ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది. మేహాద్రి ప్రధాన కాలువతో పాటు ఇతర గెడ్డల నుంచి కూడా రిజర్వాయర్‌కు నీరు పోటెత్తడంతో సోమవారం సాయంత్రానికి నీటిమట్టం 60/61 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో గేటును అడుగున్నర మేర ఎత్తి 1050 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటిపారుదలశాల ఏఈ పి.నళిని, తహసీల్దార్ వెంకటఅప్పారావు, ఆర్‌ఐ హరిప్రసూన, వర్క్ ఇన్‌స్పెక్టర్ ఎస్.సుబ్బరాజు ముందుగా రిజర్వాయర్ నీటిమట్టాన్ని సమీక్షించారు.


