వాల్తేర్ డివిజన్ ప్రత్యేక చర్యలు
పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు
తాటిచెట్లపాలెం : తుఫాన్ నేపథ్యంలో విశాఖ నుంచి బయల్దేరే, విశాఖ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. కొన్ని రైళ్లను దారి మళ్లించగా.. మరికొన్ని రైళ్లను గమ్యం కుదించింది. అలాగే వాల్తేర్ డివిజన్ పరిధిలోని స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటుచేసింది. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డీఆర్‌ఎం లలిత్‌బోహ్ర ఆయా విభాగాల అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అయితే ముందుగా సుమారు 43 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించినా, సాయంత్రానికి కొన్ని రైళ్లు యథావిథిగా బయల్దేరాయి.
28న రద్దు చేసిన రైళ్లు
● కిరండూల్–విశాఖ(18516)నైట్ ఎక్స్‌ప్రెస్
● విశాఖపట్నం–కిరండూల్(58501)పాసింజర్
● కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్
● విశాఖపట్నం–కోరాపుట్(58538)పాసింజర్
● కోరాపుట్–విశాఖపట్నం(58537)పాసింజర్
● కోరాపుట్–విశాఖపట్నం(18511)ఎక్స్‌ప్రెస్
● రాజమండ్రి–విశాఖపట్నం(67285)మెము
● విశాఖపట్నం–రాజమండ్రి(67286)మెము
● విశాఖపట్నం–కాకినాడ(17268) ఎక్స్‌ప్రెస్
● కాకినాడ–విశాఖపట్నం(17267) ఎక్స్‌ప్రెస్
● విశాఖపట్నం–గుంటూరు(22875)
డబుల్ డెక్కర్‌ఎక్స్‌ప్రెస్
● గుంటూరు–విశాఖపట్నం(22876)
డబుల్‌డెక్కర్‌ఎక్స్‌ప్రెస్
● బ్రహ్మపూర్–విశాఖపట్నం(18525)ఎక్స్‌ప్రెస్
● విశాఖపట్నం–పలాస(67289)మెము
● పలాస–విశాఖపట్నం(67290)మెము
● విజయనగరం–విశాఖపట్నం(67288) మెము
● బ్రహ్మపూర్–విశాఖపట్నం(58531)పాసింజర్
● విశాఖపట్నం–బ్రహ్మపూర్(58532)పాసింజర్
● విశాఖపట్నం–గుణుపూర్(58506) పాసింజర్
● గుణుపూర్–విశాఖపట్నం(58505) పాసింజర్
● భువనేశ్వర్–కేఎస్‌ఆర్ బెంగళూరు(18463) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్
● భువనేశ్వర్–సికింద్రాబాద్(17015)విశాఖ ఎక్స్‌ప్రెస్
● భువనేశ్వర్–పుదుచ్చేరి(20851) వీక్లీ ఎక్స్‌ప్రెస్
వాల్తేర్ డివిజన్ పరిధిలో హెల్ప్‌లైన్ డెస్క్‌లు
● విశాఖపట్నం–0891–2746330 / 2744619
● దువ్వాడ– 0891–2883456
● అరకు–08936–249832


