ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మహారాణిపేట: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సోమ, మంగళ, బుధవారాల్లో జిల్లాలో భారీ వర్షాలు, పెనుగాలులు వీచే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
● ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ప్రయాణాలు రద్దు చేసుకోవాలి.
● గాలులు వీచే సమయంలో చెట్ల కింద, హోర్డింగ్‌ల సమీపంలో నిలబడవద్దని కోరారు. పల్లపు ప్రాంతాలు, కొండ వాలు ప్రాంతాలు, నది ఒడ్డున నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి
● మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, వేటకు వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలి
● సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీచ్‌లలో స్నానాలకు దిగవద్దు
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, 0891–2590102 , 0891–2590100 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. రైతులు సైతం వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి పంటలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.


